Home జయశంకర్ భూపాలపల్లి బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి…

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి…

Bogatha waterfalls

 

వాజేడు : దట్టమైన అడవి.. ఎటు చూసినా కొండలు.. కొండలపై నుండి జాలువారే సెలయేరు.. పక్షుల కిలకిల రావాలు.. ఇన్ని అందాల నడుమ బొగత అందాలు అన్నీఇన్నీ.. కాదు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతానికి వరద నీరు భారీగా చేరుతుంది. తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లోని గుట్టలపై గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో బొగతా జలపాతం నిండుకుండలా తలపిస్తోంది. దీంతో బొగతా జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులు వందలాదిగా తరలివస్తున్నారు.

ఆదివారం సెలవు దినం కావడంతో బొగత జలపాతం వద్ద జనహోరుతో కలకలలాడింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రాంతాల నుండి సందర్శకులు జలపాతాన్ని కళ్లారా వీక్షించేందుకు తరలివచ్చారు. కుటుంబసభ్యులతో సతీ సమేతంగా తమ చిన్నారులతో జలపాతాల్లో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జలపాతం అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు దిగుతూ ప్రకృతిని ఆహ్వాదిస్తూ సందర్శకులు ఆహ్లాదంగా గడిపారు. చిల్డ్రన్స్ పార్క్‌లో చిన్నారులు తమ ఆటపాటలతో ఆనందగా గడిపారు. జలపాతానికి వచ్చిన పర్యాటకుల వాహనాలతో పార్కింగ్ ప్రదేశం నిండిపోయింది. జలపాతానికి వచ్చిన పర్యాటకులు బొగతా జలపాతం గుట్టపై వెలసి యున్న శ్రీ బోగాద్రి లక్ష్మినర్సింహస్వామిని ఆలయంలో పూజలు చేసి దర్శించుకున్నారు.

Tourists Enjoying at Bogatha waterfalls