Home ఆదిలాబాద్ పర్యాటకళ

పర్యాటకళ

 Kuntala Water Falls

 

జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్న టూరిస్టులు

నేరడిగోండ : కుంతల జలపాతంకు ఆదివారం పర్యటకులు భారీగా తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో హైదరాబాద్, కరీంనగర్, నిజమాబాద్, వరంగల్, మంచిర్యాల్, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల నుంచి పర్యాటకులు పెద్దెత్తున కుంటాల జలపాతంకు వాహనాలలో తరలివచ్చారు. జలపాతం వద్ద ఉన్న అందమైన ప్రకృతి వాతావరణంలో వారు తమ వెంట తెచ్చుకున్న కెమెరా సెల్‌ఫోన్‌లలో ఫోటోలు దిగారు.

జలపాతంతో పాటు చుట్టు పక్కల పకృతి అందాలను తిలకించి తమ కెమెరాలో బందించారు. రోజంతా ఆనందంగా జలపాతం వద్ద గడిపారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటాల జలపాతానికి జలకళ రావడంతో గత వారం రోజుల నుంచి రోజురోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఆదివారం సెలవు కావడంతో ఉదయం నుంచి జలపాతం అందాలను వీక్షించేందుకు వందల సంఖ్యలో సందర్శకుల సందడి పెరిగింది. జలపాతం వద్ద చుట్టుపక్కన ఉన్న అడవులు జాలువారే నీటి ఆలలు విశిస్తూ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో సందర్భకులు కేరింతలు కొడుతు జలపాతం అందాలను వీక్షించారు.

పోలీసుల బందోబస్తు..
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటాల జలపాతానికి అధికసం ఖ్యలో సందర్శకులు వస్తుండడంతో నేరడిగొండ ఎస్సై భారత్ సుమాన్ ఆధ్వర్యంలో జలపాతం పరిసరాల ప్రాంతంలో పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. మండలకేంద్రంలోని కుంటాల జలపాతం రోడ్డు వద్ద వాహనాలు వెళ్లే వారికి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో మద్యం తాగి ఉన్న, మద్యం బాటిల్లు తీసుకెళ్లవద్దని పర్యటకులకు పోలీసులు సూచించారు.

Tourists flocked to Kuntala Water Falls in large numbers