Home అంతర్జాతీయ వార్తలు పాండాపై రాళ్లతో దాడి… వీడియో వైరల్

పాండాపై రాళ్లతో దాడి… వీడియో వైరల్

 

చైనా: పాండా చూడగానే క్యూట్‌గా కనిపిస్తోంది కానీ అలాంటి జంతువును కొందరు రాళ్లతో కొట్టి హింసించారు. చైనాలోని ఓ జూపార్క్‌లో పాండా నిద్రిస్తుంది. ఇది చూసిన పర్యాటకులకు నచ్చలేదు. వెంటనే పాండాను నిద్ర నుంచి లేపాలని నిర్ణయం తీసుకున్నారు. పాండాపై రాళ్లు విసరడంతో అది నిద్ర నుంచి మేల్కొంది. చూడగానే ప్రశాంతంగా కనిపించే జంతువైన పాండాపై రాళ్లతో ఎలా కొట్టాలనిపించిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో జూపార్క్ అధికారులు తెలియడంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాండా ఉన్న ఎన్‌క్లోజర్ వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. జంతువులను హింసించి వారిని కఠినంగా శిక్షించాలని టూరిస్ట్‌లు డిమాండ్ చేస్తున్నారు.

 
Tourists Throwing Stones on Panda in China Zoo Park