Home ఖమ్మం విషజ్వరాల విజృంభణ

విషజ్వరాల విజృంభణ

Toxic-Feversపాల్వంచలో టైఫాయిడ్ గుబులు
పడకేసిన పారిశుద్ధం
డెంగ్యూ లక్షణాలతో పలువురు ఆసుపత్రుల్లో చేరిక

మన తెలంగాణ/పాల్వంచ: భద్రాద్రి జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్పులవల్ల ప్రజలు విషజ్వరాల బారీన పడి టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలతో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చేరి చికిత్సలు పొందుతున్నారు. తాజాగా ఎన్‌ఎమ్‌డిసిలో పనిచేస్తున్న ఉద్యోగికి డెంగ్యూ జ్వరం సోకిన లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రతి సంవత్సరం వర్షకాలం సీజన్‌లో జ్వరాలబారీన పడి ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. జ్వరాలకు కారణమవుతున్న దోమలు, ప్రవహించని మురుగునీ రు, వాతావరణ అపరిశుభ్రత ప్రధాన కారణమవుతున్నాయి. పురపాలక సంఘం అధికారులు కొన్ని ప్రాంతాల్లో పారిశు ద్ధ్య కార్యక్రమాలు చేపట్టి నా అవి ఏ మాత్రం సరిపోవ డంలేదు. కాల్వల్లో మురుగు నీరు చేరి నెలల తరబడి నిల్వ ఉండి అక్కడ దోమలు వృద్ధిచెంది విషజ్వరాలు, టైఫా యిడ్, డెంగ్యూ వ్యాధులు వ్యాపిస్తు న్నాయి.  కొన్ని ప్రాంతా ల్లో మాత్రమే దోమల మందు చల్లించి, బ్లీచింగ్ వేసి చెత్తాచెదరాన్ని తొలగించడం జరుగుతుంది. కాని మురికివాడలుగా గుర్తించిన ప్రాంతాల్లో పట్టణ పారిశుద్ధ్య సిబ్బంది తగినవిధమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జ్వరాలకు సంబంధించి ఖచ్చితమైన ప్రణాళికలు చేపట్టిన సందర్భాలు కూడా లేవు. మరోవైపు ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని, ఇండ్లలో ఉన్న నీటిని తొలగించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం మున్సిపల్ అధికారులపై, ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఉంది. ఇప్పటికైనా సీజనల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్ర మైన వాతవారణాన్ని, పరిసరాల పరిశుభ్రతను ప్రజలకు వివిరంగా తెలిపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఎంతైనాఉంది.