Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

Tractor Driver Died In Road Accident At Nalgondaనల్లగొండ : రోడ్డు ప్రమాదంలో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయారు. ఈ ప్రమాదం కట్టంగూర్ మండల పరిధిలోని ఐటిపాుమల వద్ద 65వ నంబర్ జాతీయరహదారిపై మంగళవారం జరిగింది. ఐటిపాముల గ్రామంలో హరితహారం మొక్కలకు నీరు పోచేందుకు పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రామమల్లు(49) ఉదయం మార్తవారిగూడెం వెళ్లి ట్యాంకర్‌లో నీళ్లు నింపుకున్నాడు. తిరుగు ప్రయాణంలో సర్వీస్ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డు మీదకు వస్తుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామమల్లు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మృతెడు రామమల్లుకు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. నిరుపేద రామమల్లు కుటుంబాన్ని ఆదుకోవాలని ఐటిపాముల గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రామమల్లు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.