Friday, April 19, 2024

మహబూబాబాద్‌లో విషాదం.. ట్రాక్టర్‌ తిరగబడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Tractor overturns and man dies in Mahabubabad

 

మహబూబాబాద్ : పొలాన్ని దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం శివారు పెద్ద తండాలో ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి చెందాడు. పెద్ద తండాకు చెందిన సాగర్ (30) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బానోతు నరేష్ వ్యవసాయ భూమిలో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ వీల్స్ పొలంలో దిగబడ్డాయి. దీంతో సాగర్ బండి రివర్స్ తీయబోయాడు. ఎక్స్ లెటర్ ఎక్కువగా ఇస్తూ రివర్స్ తీస్తుండగా ట్రాక్టర్ ఇంజన్ ఒక్కసారిగా వెనక్కు లేచి పడింది. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News