Home తాజా వార్తలు వాణిజ్య యుద్ధాలతో అనిశ్చితి

వాణిజ్య యుద్ధాలతో అనిశ్చితి

Nirmala Sitharaman

 

పెట్టబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది
ప్రపంచ దేశాలకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య యుద్ధాలు, రక్షణ వాదం అనిశ్చితిని సృష్టించాయని, దీని ప్రభావం అంతిమంగా పెట్టుబడులపైన, వస్తు, సేవలపైన పడుతుందని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ దేశాలను తీవ్రంగా హెచ్చరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ( ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ గ్రూపు వార్షికోత్సవం, ప్లీనరీ సమావేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం శుక్రవారం వాషింగ్టన్‌లో జరిగింది. సమావేశం వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది.

వ్యాపార యుద్ధాలు, రక్షణ వాదం అనిశ్చితిని సృష్టించాయని, ఫలితంగా పెట్టుబడులు, వస్తు, సేవలు ప్రభావితమవుతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏకకాలంలో ఏర్పడిన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి సమష్టి కృషి అవసరమన్నారు. ప్రపంచ వృద్ధికి అన్ని దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పెరిగిన వాణిజ్య ఏకీకరణ, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, పెద్ద ఎత్తున పోగుపడిన రుణాలు బలమైన అంతర్జాతీయ సమన్వయం ఆవశ్యకతను వెల్లడిస్తున్నాయని నిర్మల అన్నారు. మందగమనం ఓ సంక్షోభంగా మారే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ మంత్రుల స్థాయి కమిటీ భోజన విరామ సదస్సులో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

Trade Wars to Impact Flow of Capital and Goods