Thursday, April 25, 2024

శివారు ప్రాంతాల్లో …….. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం

- Advertisement -
- Advertisement -

తగ్గిన వాహనాల వేగం…
గంటకు 20 నుంచి 20మాత్రమే…..

Traffic jam in Out cuts of GHMC
మనతెలంగాణ,సిటీబ్యూరో: సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలు ఒక్క సారిగా పల్లె బాట పట్టడంతో దాని ప్రభావంతో శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. విజయవాడ వెళ్ళెందుకు ప్రధాన మార్గమైన దిల్‌షుకనగర్,ఎల్‌బినగర్, వనస్థలపురం ప్రాంతాల్లో, అదే విధంగా వరంగల్ వెళ్ళేందుకు ప్రధాన మార్గమైన రామాంతపూర్, ఉప్పల్,మేడిపల్లి,ఘటకేసర్ మార్గాల్లోనూ, కర్నూలు వెళ్ళేందుకు ప్రధాన మార్గమైన ఆరాంఘర్ చౌరస్తా,శంషాబాద్ మార్గాల్లో, ఈ విధంగా నగరం నలుదిక్కులా ఉన్న శివారు ప్రాంతాల మార్గాలన్నీ వాహన రద్దీ కారణంగా ఎక్కడికక్కడే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌లకు దారీ తీయడంతో వావానాల వేగం గంటకు 15 నుంచి 20 తగ్గపోయింది..

ఒక వైపు ఆర్టిసి అధికారులు తగిన బస్సులను ఏర్పాటు చేయడంలో విఫలం కావడం,మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహకులు పెద్ద ఎత్తున ఛార్జీల వసూలు చేస్తుండటంతో సొంత వాహనాలు ఉన్న వారు వాటిలో ప్రయాణించేందుకు సిద్దం పడుతుండగా మరి కొందరు, కార్ పూలింగ్ (ప్రయాణ ఖర్చులు షేర్ చేసుకుని కార్లలో బయలు దేరడం) వంటి ఏర్పాట్లు చేసుకోవడంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్ల మీదకు వచ్చాయి.

రవాణా సౌకర్యం కల్పించడంలో అర్టిసి అధికారులు విఫలం:

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆర్టిసి అధికారులు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు,కడప తదిర ఆంద్రా ప్రాంతాలకు అదే విధంగా ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ, మిర్యాలగూడ తదితర తెలంగాణ ప్రాంతాలకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా 10 నుంచి 15 లక్షల మంది వారి స్వగ్రామాలకు వెళుతుంటారు. ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సౌకార్యలు కల్పించక పోవడం, ప్రైవేట్ వాహనాలు యాజమాన్యాలు పెద్ద ఎత్తున వసూలు చేస్తుండటంతో తామ వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందని వాహన దారులు అంటున్నారు. సాధారణంగా ఆర్టిసి బస్సుల్లో నగరం నుంచి కోదాడకు రూ.160 , విజయవాడకు రూ.350 నుంచి 400 ఉండగా ప్రైవేట్ వాహనాల్లో (తుఫాన్,క్వాలిస్,) తదితర ప్రైవేట్ వాహనాల్లో నగరానికి 100 కిలో మీటర్ల దూరం ఉన్న నల్గొండకు రూ.300అదే విధంగా నగరం నుంచి 180 కిలో మీటర్ల దూరం ఉన్న కోదాడకు రూ.500లు, నగరం నుంచి 250 కిలో మీటర్లు దూరం ఉన్న విజయవాడకు రూ.1000 కిలో మీటర్లతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున దోచుకోడంతో తాము సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నామని వాహనదారులు చెబుతున్నారు.
మామూళ్ళ మత్తులో రవాణాశాఖ అధికారులు ః
సాధారణ సమయంలో రోడ్డు నిబంధనల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా పెద్ద ఎత్తున హడావిడి చేస్తుండే రవాశాఖ అధికారులు,ప్రైవేట్ ట్రావెల్స్ ,వాహనాలు పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చూసిచూడినట్లు వదిలేయడమే కాకుండా వారు ఇచ్చే మామూళ్ళను లెక్క పెట్టుకుంటున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పండుగల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహకులునియమ నిబంధనలు ఉల్లంఘిస్తారని తెలిసి వాటిని అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టక పొవడంతో వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూళ్ళు చేసుకుంటున్నారనే ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో నిబంధనలు ఉల్లంఘన కారనణంగా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేక ఉన్నా వాటిని ఏ ఏమాత్రం పట్టించు కోకుండా నిర్లక్షంగా వ్యవరిస్తున్నారు. మళ్ళీ అటువంటి ప్రమాదాలే జరిగితే రవాణాశాఖ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక నైనా అధికారులు ఈ అంశంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News