Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సైలెన్సర్ తీసేసి వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ డిఎస్సీ

సైలెన్సర్ తీసేసి వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ డిఎస్సీ

Traffic police
అమరావతి: గుంటూరులో ట్రాఫిక్ పోలీసులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. స్నేక్, ఫైర్ కటింగ్ డ్రైవ్ చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ సుప్రజ మాట్లాడుతూ… సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, అదేవిధంగా, వాహనాలకు సైలెన్సర్లు తీసి వేసే మెకానిక్ లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు హెచ్చారించారు.
traffic police special drive in guntur district