Home తాజా వార్తలు వారాంతపు ‘సంత’… ట్రాఫిక్ ‘చింత’

వారాంతపు ‘సంత’… ట్రాఫిక్ ‘చింత’

weekly marketమౌలాలి: మౌలాలి పరిధిలోని ప లు ప్రాంతాలలో ప్రతి వారం వారం నిర్వహించే తైబజార్( వారంతపు కూరగాయల సంత) కొందరికి ఆనువుగా ఉండగా, మరి కొందరికి ఇబ్బందికరంగా మారుతోంది. సాయంత్రం 4,5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వారంత పు సంతలు కొనసాగుతాయి. ముఖ్యంగా ఇళ్ల ముందే వా రంతపు సంతలు ఏర్పాటు చేస్తుండటంతో సమీప కాలనీలు, బస్తీల ప్రజలు తాజా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు , పూ లు , పచ్చళ్లు, గృహవసరాల కోసం వినియోగించే ఇతర వస్తువులు స రసమైన ధరలకే విక్రయిస్తుండటంతో వీటి కోసం కొనుగోలు దారులు వస్తుంటారు.

వారంతపు సంతలు ఏర్పాటు చేయక ముందు మౌలాలి ప్రాంత వా సులు ఇటు నేరేడ్‌మెట్ రైతు బజార్, అటు కుషాయిగూడ కూరగాయాల మా ర్కెట్,లేదా సికింద్రాబాద్ మోండా మార్కెట్‌కు వెళ్లి వారానికి సరిపడా త మకు కావాల్సిన కూరలు కొనుక్కొనే వచ్చే వారు. ఆయా ప్రాంతాల కు వెళ్లాలంటే దాదాపు రెండు, మూడు కిలో మీటర్లు దూరం వెళ్లా ల్సి వచ్చేది. దూరభారం, సమయం వృధా కాకుండా ఈ సం తలు తమకెంతో ప్రయోజనంగా ఉంటున్నాయని స్థ్ధానికు లు భావిస్తున్నారు.

దీంతో ప్రతి వారం తమ ఇళ్ల ముందే ఏర్పాటు చేస్తున్న సంతలలో తాజా కూ రగాయలు లభిస్తుండటంతో ఈ సంతలలో నే తమకు కావాల్సిన కూరగాయలు కొ నుగోలు చేయడానికి స్ధ్థానికులకు ఈ సంతలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మౌలాలి ప్రాంతంలోని సాయినాధాపు రం, భరత్‌నగర్, సాధుల్లానగర్, మహాత్మగాంధీనగర్, ఆర్టీసీ కాలనీ, గాయత్రీనగర్ రాధికా మె యిన్ రోడ్డు తదితర ప్రాంతాలలో వారంతపు సంతలు నిర్వహిస్తున్నారు.

* రోడ్లపై సంతలతో ట్రాఫిక్ ఇబ్బందులు…

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అనేక ప్రాంతాలలో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ఈ వారంతపు సంతలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మౌలాలి పరిధిలో సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే వారంతపు సంతలు కొనసాగుతున్నాయి. సోమవారం మౌలాలి మహత్మగాంధీనగర్, మౌలాలి రైల్వేక్వార్టర్స్, దొడ్లబస్తీ, దుర్గానగర్, ఎస్‌పీనగర్,బుధవారం భరత్‌నగర్ చౌరస్తా, శుక్రవారం సాయినాథాపురం, సాధుల్లానగర్‌లలో రోడ్లపైనే వారంతపు సంతలు నిర్వహిస్తున్నారు.

త మ కాలనీలలో నిర్వహించే ఈ సంతల పట్ల ప్రజలు మక్కువ చూపుతున్నారు. దీంతో సాయినాధాపురం ప్రగతినగర్, గీతానగర్, ఆఫీసర్స్ కాలనీ,గాంధీనగర్,శ్రామిక్‌నగర్, భరత్‌నగర్, షఫీనగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, గణేష్‌నగర్, నెహ్రునగర్, హనుమాన్‌నగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాం తాల ప్రజలకు అనువుగా ఉండటంతో సంత నిర్వహించిన రోజు , వారి రాక పోకలతో రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్లపై సంతలు ఏర్పాటు చేయడం, ఇదే మార్గంలో తమ గమ్యస్ధానాలకు చేరాల్సి ఉండటంతో వాహన చోధకులు, ప్రయాణీకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

* సంత ఉంటే అమ్మో..! ఆ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్…

సాయినాధాపురం (సాయిబాబా దేవాలయం) ప్రధాన రహదారిపై వారంతపు సంత కొనసాగుతుంది. అదే విధంగా గాంధీనగర్, భరత్‌నగర్, గాయత్రీనగర్— రాధికా మెయిన్ రోడ్డు, సర్ధార్‌పటేల్‌నగర్ తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారులపై తైబజార్‌లు నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కూరగాయాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారు తమ వాహనాలకు పార్కింగ్ సౌకర్యం లేక పోవడంతో పాటు రోడ్డుపై వెళుతున్న వాహనాలు, ఆర్టీసీ బస్సుల కారణంగా అటు వినియోగదారులు , ఇటు ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతపు సంతలు ఏర్పాటు చేసిన రోజుల్లో ఆయా మార్గాలలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. చీకటి పడిదంటే చాలు.. ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వాహన దారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, ఓల్డ్ సఫిల్‌గూడ, వినాయక్‌నగర్, మల్కాజిగిరి, రైల్వేక్వార్టర్స్, లాలాపేట, మౌలాలి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే దుంప తెగుతుందని వాహన దారులు, ఆర్టీసీ బస్సు ప్రయాణీకులు వాపోతున్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో అయితే వీరి పరిస్ధితి మరీ దా రుణంగా ఉంటుంది. ఇక సమీప ఇళ్లలో ఉండే వారి పరిస్ధితి మరీ దారుణంగా ఉంటుంది. ఇళ్ల ముందే సంతలు ఏర్పాటు చేస్తుండటంతో త మ వాహనాలతో బయటి నుండి ఇంట్లోకి, ఇంటి నుండి బయటికి వెళ్ల లేక అష్ట కష్టాలు పడుతున్నారు. సంత ఉన్న రోజు ప్రత్యామ్నాయంగా ఇతర రోడ్ల గుండా వాహనాలు, ఆర్టీసీ బస్సులను మళ్లించాలన్నా అదీ వీలు కాదు. ఇవే మా ర్గం ద్వారా ప్రయాణించాల్సి వస్తుంది. దీనికి చక్క ని పరిష్కార మార్గం సంతలు ఉన్న చోట ట్రా ఫిక్ కానిస్టేబుళ్లు ఏర్పాటు చేయడం, రోడ్డు కు దూరంగా సంతలను కొద్దిగా వెనుక్కి ఏర్పాటు చేసుకోవడమే.

* సంతలో సౌకర్యాలేవి..?
సంతలను రోడ్డుపై ఏర్పాటు చేయనీయకుండా అనువుగా స్ధలాలను కేటాయించాల్సిన అవసరం జీహెచ్‌ఎంసీపై ఉంది. తై బజార్‌కు టెండర్లు పిలిచి , టెండర్ దక్కించుకున్న నిర్వాహకుల ద్వారా జీహెచ్‌ఎంసీ లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. కాని సంతలు ఏర్పాటు చేసే స్ధలాలలో కనీసం తాగు నీటి వసతి, వీధిదీపాలు, మరుగు దొడ్లు,వాహానాల పార్కింగ్ వసతి కల్పిండంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. రోడ్లపై నిర్వహించే ఈ వారంతపు సంతల నిర్వహణకు అనువుగా స్ధలాలు కేటాయించడంతో పాటు వాటిల్లో సదుపాయాలు కల్పించాలని వ్యాపారస్థులు, వినియోగదారులు, ప్రయాణీకులు కోరుతున్నారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నియమించాలి

రోడ్డుపై ఏర్పాటు చేస్తున్న వారంతపు సంతల వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. సంత ఉన్న రోజు ఆయా కాలనీలలో రోడ్డుపై వెళ్లాలంటే విసుగు వస్తుంది. అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఇష్టం వచ్చినట్లుగా రోడ్డుపై కూరగాయల బండ్లు ఏర్పాటు చేయడం, కూరల కొనుగోలు దారుల బేరసారాలతో రోడ్లపై నడవాలంటే కూడా నడవలేని దుస్ధితి నెలకొంటుంది. ఇకనైనా సంతల నిర్వహణ సమయంలో ఖచ్చితంగా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి , ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి .

                                                                                         వంశీ ముదిరాజ్, ఎస్‌పీనగర్

సంత ఏర్పాటుకు స్ధ్థలాలు కేటాయించాలి

ఇళ్ల ముంగిటే సంత ఏర్పాటు చేయడం వల్ల స్ధ్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉం టుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లి కూరలు కొని తెచ్చుకోవాల్సిన వ్యయ ప్రయాస తప్పింది.సంతలు రోడ్లపై ఏర్పా టు చేయకుండా , సంతల నిర్వహణకు, నిర్వాహకులకు వేరే ప్రాంతంలో అనువైన స్థ్ధలాలు కేటాయిస్తే బాగుంటుం ది. అదే విధం గా సంతలలో సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారిస్తేసారిస్తే బాగుంటుంది.

                                                                                         మేకల మోహన్‌యాదవ్

Traffic Problems Due to Weekly Markets