Home తాజా వార్తలు ఇందిరాపార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

ఇందిరాపార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Traffic-restrictions
ఆర్టిసి కార్మికులకు మద్దతుగా ఎమ్మార్పిఎస్ మహాదీక్ష

హైదరాబాద్: ఆర్టిసి కార్మికులకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ఎమ్మార్పిఎస్ నిర్వహించనున్న మహా దీక్ష సందర్భంగా ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మార్పిఎస్ దీక్షకు ఎలాంటి అనుమతిలేదని పేర్కొన్నారు. ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు గుమికూడే అవకాశం ఉండడంతో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉండనున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.  ఆర్టిసి ఎక్స్ రోడ్డు నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే వాహనాలు అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద కుడి లేదా ఎడమ వైపునకు వెళ్లాలి.  తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలు లోయర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇందిరా పార్క్ వైపు మళ్లకూడదు. వార్తా దినపత్రిక లైన్ నుంచి ఎల్‌ఐసి వైపు వచ్చే వాహనాలు బండ మైసమ్మ క్రాస్ రోడ్డువైపు వెళ్లాలి. దోమలగూడ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ 5,6 నుంచి హిమాయత్‌నగర్ వైపు వెళ్లాలి.

Traffic restrictions at Indira Park