Home తాజా వార్తలు నేడు రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

నేడు రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Trafic

హైదరాబాద్: ఉగాది వేడుకల సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబందనలు విధిస్తున్నట్టు నగర ట్రాఫిక్ కమిషనర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. మొనప్ప ఐలాండ్ నుంచి వివి జంక్షన్ వరకు రాజ్‌భవన్‌కు ఇరువైపులా ఉన్న రహదారుల్లో వేడుకలకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని సూచించారు. దీంతో ఆ సమయంలో సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కమిషనర్ తెలిపారు.