Friday, April 19, 2024

ఎన్‌టిఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 9 నుంచి 22 వరకు అమలు
ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సిటిబ్యూరోః ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌టిఆర్ మార్గ్‌లో రేసింగ్ నిర్వహించనున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాంలో వెళ్లాలని కోరారు.
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేవారిని తెలుగుతల్లి వైపు అనుమతించరు. తెలుగుతల్లి ఫ్లైఓవఱ్ మీదుగా కట్టమైసమ్మ దేవాలయం లేదా లోయర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలి. వీరు ఇక్బాల్ మీనార్ వద్ద కుడి మలుపు తీసుకుని పబ్లిక్ గార్డెన్స్ జంక్షన్, బషీర్‌బాగ్, లిబర్టీ వైపు వెళ్లి బిఆర్‌కె భవన్ లేదా ట్యాంక్ బండ్ వైపు వెళ్లవచ్చు.
బుద్ధభవన్ లేదా నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్, ట్యాంక్‌బండ్‌వైపు మళ్లిస్తారు.
రసూల్‌ఫుర లేదా మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు, నల్లగుట్ట జంక్షన్ వద్ద నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
వివి విగ్రహం నుంచి ఖైరతాబాద్ ప్లైఒవర్ వెపు వచ్చే ట్రాఫిక్, నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు అనుమతించరు, వివి విగ్రహం ఖైరతాబాద్ నుంచి షాదన్ కాలేజీ, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్ లేదా తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ లేదా రవీంద్రభారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
బిఆర్‌కెఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ లేదా రవీంద్రభారతి జంక్షన్ వైపు అనుమతించరు.
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్రభారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించరు. బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లించబడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News