Thursday, April 18, 2024

ట్యాంక్‌బండ్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions near Tank Bund
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: పర్యటకులు హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లనున్న వాహనాలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు 3 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనాలను అనుమతివ్వరు, అంబేద్కర్ విగ్రహం మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.

తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వెళ్లే వాహనాలను అనుమతి ఇవ్వరు. అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ, హిమయాత్‌నగర్ వెపు మళ్లిస్తారు. కర్బాలా మైదాన్ మీదుగా అప్పర్ ట్యాంక్ వెళ్లే వాహనాలను సేయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. డిబిఆర్ మిల్స్ మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే వాహనాలు డిబిఆర్ మిల్స్ నుంచి గోశాల, కవాడిగూడ, జబ్బర్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలు ఓల్డ్ సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

పార్కింగ్ ప్రాంతాలు…

అంబేద్కర్ స్టాట్యూ నుంచి లేపాక్షి వరకు, డాక్టర్ కార్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శనగర్, నీయర్ ఆంధ్రా సెక్రటేరియట్, సేయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్, బుద్ద భవన్ బైక్‌సైడ్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టిఆర్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News