ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో కాల్పుల మోత మోగింది. ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా.. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. ఈ ఘటనను ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాలశాఖ ధ్రువీకరించింది. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లోని సెకండరీ స్కూల్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆస్ట్రియా ఎలైట్ టాక్టికల్ యూనిట్ కోబ్రాతో సహా ప్రత్యేక దళాలను మోహరించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అత్యవసర సేవలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన పారామెడిక్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు చికిత్స అందించారు. తర్వాత గాయపడిన వారిని సమీపంలోని కచేరీ హాల్‌కు తరలించారు. పోలీసు ప్రతినిధి సబ్రి యోర్గున్ ప్రకారం.. అనుమానిత కాల్పులు జరిపిన వ్యక్తి పాఠశాలలో విద్యార్థి అని భావిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకునే ముందు తుపాకీలతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తరువాత అతని మృతదేహం భవనం లోపల బాత్రూంలో గుర్తించారు.
ఆస్ట్రియా స్కూల్ లో కాల్పుల మోత.. 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -