Home తాజా వార్తలు ’అంథిమ్‌’ సినిమా నుంచి ట్రైలర్ విడుదల

’అంథిమ్‌’ సినిమా నుంచి ట్రైలర్ విడుదల

Trailer Release From Antim Movieముంబయి : బాలీవుడ్ కండల వీరుడు,  ఆయుష్ శ‌ర్మ  కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ’అంథిమ్‌..ది ఫైన‌ల్ ట్రుత్‘. ఈ సినిమాకు  మ‌హేశ్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి  ట్రైల‌ర్‌ను  విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునేవిధంగా ఉంది. స‌ల్మాన్‌ఖాన్ పోలీసు ఆఫీస‌ర్ పాత్ర‌లో, ఆయుష్ శ‌ర్మ రాహులియా పాత్ర‌లో నటిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ క‌థాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. స‌ల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ బ్యాన‌ర్ల క‌ల‌యిక‌లో స‌ల్మాన్‌ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో  ప్ర‌గ్యాజైశ్వాల్‌, మ‌హిమ మ‌క్వానా, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2018లో వ‌చ్చిన మ‌రాఠీ చిత్రం ముల్షీ ప్యాట‌ర్న్ ఆధారంగా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. నవంబరు 26న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తారు.