Home తాజా వార్తలు ’రాధే‘ సినిమా ట్రైల‌ర్ విడుదల

’రాధే‘ సినిమా ట్రైల‌ర్ విడుదల

Trailer Release From Bollywood Movie Radheముంబయి : ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ’రాధే‘. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునేవిధంగా ఉంది. దర్శకుడు ప్రభు దేవా రూపొందిస్తున్న ఈ సినిమా ఈద్ కానుకగా థియేటర్లతో పాటు ఒటిటిలోనే ఒకే సారి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. సల్మాన్ యాక్షన్, ఆయన పలికిన డైలాగులు, కామెడీ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ సల్మాన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముంబయిలో పెరుగుతున్న నేరాలను  అరికట్టడానికి వచ్చే స్పెషల్ ఆఫీసర్ గా ఈ సినిమాలో సల్మాన్ క‌నిపించ‌నున్నారు.