Home తాజా వార్తలు ‘క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు’ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌ల‌

‘క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు’ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌ల‌

Kamma Rajyam Lo Kadapa Reddluహైదరాబాద్  : వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు’ ఈ సినిమాను నవంబరు 29న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా బుధవారం మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఎపికి సంబంధించిన కులరాజకీయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ నేతలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా టైటిల్ తోనే చర్చగా మారిన ఈ సినిమా విడుదలైన అనంతరం ఎన్ని సంచనాలు సృష్టించనుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Trailer Release From Kamma Rajyam Lo Kadapa Reddlu