Home తాజా వార్తలు ‘మిస్ మ్యాచ్’ సినిమా నుంచి ట్రైలర్ విడుదల

‘మిస్ మ్యాచ్’ సినిమా నుంచి ట్రైలర్ విడుదల

MisMatch Telugu Movieహైదరాబాద్ :  ఉదయ్ శంకర్ , ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన సినిమా ‘మిస్ మ్యాచ్’. ఈ సినిమాకు  నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించారు.  శ్రీరామ్ రాజు – భరత్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ఫైటర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. హీరోహీరోయిన్ల కుటుంబాలకు సంబంధించిన కీలక సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కుస్తీ పోటీల్లో పాల్గొనే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడడం, అయితే హీరోతో పెళ్లికి కుస్తీ పోటీల్లో పాల్గొనడమే అభ్యంతరం కావడం తదితర సన్నివేశాలను ఈ ట్రైలర్ లో చూపించారు. డిసెంబర్ 6న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్ ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ‘మిస్ మ్యాచ్’ సినిమా ఆమె కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందోనన్న అభిప్రాయం ఆమె అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.

Trailer Release From MisMatch Telugu Movie