Thursday, April 25, 2024

కేరళ స్టేషన్‌లో ఆగకుండా పోయి… కిలో మీటరు వెనక్కి వచ్చిన రైలు

- Advertisement -
- Advertisement -

చెరియానాడ్(కేరళ): స్టేషన్‌లో ఆగాల్సిన రైలు ఆగకుండా ముందుకెళ్లిపోయింది కేరళలో. కొంత దూరం వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్న లోకో పైలట్ దాదాపు కిలోమీటరు వరకు రైలును వెనక్కి నడిపి ప్రయాణికులను గమ్యంలో దింపాడు. ఈ విచిత్ర ఘటన అలప్పుళ జిల్లాలో సోమవారం ఉదయం 7.45 గంటలకు చోటు చేసుకుంది.

షోరనూర్ నుంచి వేనాడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు మావెలిక్కర్, చెంగన్నూర్ మధ్యన ఉన్న చెరియానాడ్ రైల్వే స్టేషన్‌లో ఆగాల్సింది. కానీ రైలు ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. వెంటనే అటు స్టేషన్‌లో రైలు ఎక్కాల్సిన వాళ్లు, దిగాల్సిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికి లోకో పైలట్‌కు వెనక స్టేషన్‌లో ఎక్కాల్సిన ప్రయాణికుల విషయం గుర్తుకు రావడంతో రైలును వెనక్కి తెచ్చాడు. రైలును 700 మీటర్లు వెనక్కి పోనిచ్చి మరీ స్టేషనులోని ప్రయాణికులను ఎక్కించుకున్నాడు.

ఈ ఘటనపై ప్రయాణికులెవరూ ఫిర్యాదు చేయలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంత జరిగినా రైలు సరైన సమయానికే గమ్యస్థానం చేరుకుంది. కాగా చేర్యానాడ్ స్టేషన్‌లో సిగ్నల్ లేదా స్టేషన్ మాస్టర్ లేకపోవడం వల్ల రైలు ఆగకుండా వెళ్లిపోయి ఉంటుందని, కాగా లోకో పైలట్‌ను వివరణ కోరనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్టేషన్‌లో రైలు ఆపకపోవడంపై విచారణ చేపడతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News