Thursday, April 25, 2024

సిద్దిపేట జిల్లాకు రైలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఆ జిల్లాలో రైలు కూతపెట్టబోతోంది. మనోహారాబాద్ నుంచి మార్చిలో రైలును నడిపేందుకు దక్షిణమధ్య అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2023, -24 బడ్జెట్లో మనోహరాబాద్ టు -కొత్తపల్లి రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించడంతో సిద్దిపేట జిల్లా రైలు కల నెరవేరనుంది.
2006-, 07లో ప్రభుత్వం ఈ రైల్వే ప్రాజెక్టును చేపట్టగా ఆలస్యమవుతోంది. అయితే రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఈ పనులు వేగవంతమయ్యాయి. 151 కి.మీ.ల ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేయాలని గడువును పొడిగించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలను అనుసంధానించేలా రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టగా ప్రస్తుతం అది రూ.1,600 కోట్లను దాటింది. గత ఆర్థిక సంవత్సరం (2022,-23) బడ్జెట్లో ఈ మార్గానికి రూ.160 కోట్లను కేటాయించడంతో పాటు ఈసారి అదనంగా రూ.25 కోట్లను పెంచారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు ఈ మార్గాన్ని పొడిగించేలా…
మనోహరాబాద్ టు -కొత్తపల్లి మార్గంలో ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు 41 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఇప్పటికే పూర్తయింది. గత ఏడాది జూన్‌లో గజ్వేల్ వరకు గూడ్స్ రైళ్ల సేవలను ప్రారంభించారు. కొడకండ్ల వరకు ట్రయల్ రన్ కూడా చేపట్టారు.ప్రస్తుతం కుకునూర్పల్లి మండల పరిధిలో దుద్దెడ వరకు కొనసాగుతున్నాయి. త్వరలోనే సిద్దిపేటలో స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి.

మార్చిలో దుద్దెడ వరకు రైలు కూత వినిపించటమే లక్ష్యంగా రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ నిధులు అందితే రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు ఈ మార్గాన్ని పొడిగించాలని భావిస్తున్నారు. తాజాగా కేటాయించిన నిధులతో సిద్దిపేట జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల పరిధిలో రైలు కట్టల నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News