Home తాజా వార్తలు సినిమాటోగ్రఫీలో శిక్షణ

సినిమాటోగ్రఫీలో శిక్షణ

Cinima

మినీ రవీంద్రభారతి ఏర్పాటుకు చర్యలు
ఎఫ్‌డిసి రామ్మోహన్‌రావు
మన తెలంగాణ / నస్పూర్ : సినీమాటోగ్రఫీలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలంగాణ ప్రభుత్వ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ రామ్మోహన్‌రావు అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సినీరంగంలో ఆసక్తి చూపుతున్న వారికి శిక్షణ ఇవ్వడానికి వరంగల్, నిజమాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాడానికి కృషి చేస్తామని, సినిరంగంలో మెలకువలు నేర్చుకోవడానికి డిప్లమా లాంటి కోర్సులు ఏర్పాటు చేయడానికి తెలంగాణలో వున్న యూనివర్శిటీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని హంగులతో కూడిన ధియేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మంచిర్యాలలో మినీ రవీంద్రభారతి లాంటి కళాకేత్రాన్ని ఏర్పాటు చేయడానికి కోటి రూపాయల నిధులు ఇవ్వడానికి సిద్దమన్నారు. జిల్లా కలెక్టర్‌కు ఈవిషయమై స్థలం కేటాయింపుకు విన్నవించినట్లు తెలిపారు. ఈసమావేశంలో నాయకులు వెంకటేశ్వర్‌రావు, బెల్లంకొండ మురళీధర్, సింగతి మురళీ, సిరిపురం రాజేశ్, పోడేటి రాజు, కారుకూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు