Thursday, April 25, 2024

ఆర్‌టిసి ఆధ్వర్యంలో డ్రైవింగ్‌ శిక్షణ

- Advertisement -
- Advertisement -

Training in driving under auspices of RTC

 

మన తెలంగాణ, హైదరాబాద్ : టిఎస్ ఆర్‌టిసి ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో శిక్షణా శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ డిపో-3 డిపో మేనేజర్ ఎం. శ్రీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవింగ్ శిక్షణా శిభిరాన్ని పికెట్ డిపోలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమ 30 రోజులు 36 గంటల పాటు శిక్షణ ఉంటుందని, అందులో 16 గంటలు డ్రైవింగ్‌పై అవగాహన తరగతులను మరో  20 గంటల పాటు డ్రైవింగ్ శిక్షణ బస్సుల్లో ఇవ్వనున్నారని ఆయన వెల్లడించారు. అదే విధంగా స్టేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ పొందినవారికి ఆర్టిసీ అధికారులు దృవీకరణ పత్రాలు జారీ చేస్తారన్నారు. ఆర్టిసి డ్రైవింగ్‌పోస్టుల భర్తీసమయంలో వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణ రుసుము రూ.15,600 ఉంటుందని, శిక్షణ తీసుకునే అభ్యర్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒక సంవత్సరం లైట్‌మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి సదరు లైసెన్స్‌గడువు 20 సంవత్సరాల వరకు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హైదరాబాద్ డిపో మేనేజర్ శ్రీనాథ్ ( 99592225120)ను సంప్రదించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News