Thursday, March 28, 2024

సైబరాబాద్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ

- Advertisement -
- Advertisement -

Training on Physical Fitness in Cyberabad

అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చిన సిబ్బంది
పాల్గొన్న 2020 బ్యాచ్ 298మంది కానిస్టేబుళ్లు
త్వరలో అధికారులకు ట్రైనింగ్

మనతెలంగాణ, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు వారం రోజులపాటు శారీరక సామర్థ్యంపై శిక్షణ ఇచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో 2020లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. గత నెల 21వ తేదీన మొదటి బ్యాచ్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 102మంది, రెండో బ్యాచ్‌లో 100మంది, మూడవ బ్యాచ్‌లో 96మందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు 298మంది కానిస్టేబుళ్లకు వివిధ అంశాల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇచ్చారు. అరెస్టు, పట్టుకోవడంలో టెక్నిక్, రూమ్ క్లీనింగ్, వాహనాల ఇంటర్‌సెప్షన్, సెర్చింగ్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. వీటిలో పోలీసులు పట్టు సాధించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

కానిస్టేబుళ్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు వారం రోజుల ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇచ్చారు. పంచులు, స్టిక్స్, నైఫ్ డెఫెన్స్ ద్వారా ఎలా రక్షించుకుంటూ మిగతా వారిని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పారు. నేరస్థులు గన్స్‌తో దాడిచేసేందుకు ప్రయత్నిస్తే ఎలా అడ్డు కోవాలి, అనుమానితులను ఎలా వెతుకాలి, వాహనాల తనిఖీ, లిఫ్టింగ్ టెక్నిక్స్, ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నప్పడు ఎలా కంట్రోల్ చేయాలి, రోప్ పార్టీ, ఐఈడిలు అమర్చినప్పుడు చేయవలసిన, చేయకూడని పనులు, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ కంట్రోల్‌పై శిక్షణ ఇచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలను ఏ విధంగా రక్షించాలో నేర్పించారు. రానున్న రోజుల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు కూడా ఇలాగే శిక్షణ ఇవ్వనున్నారు.

సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆలోచన…

పోలీసులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో అన్ని అంశాల్లో కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సిపి విసి సజ్జనార్ భావిస్తున్నారు. దానికి అనుగుణంగా కానిస్టేబుళ్లకు ఫిజికల్ ఫిట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌పై శిక్షణ ఇప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News