హైదరాబాద్: బిటెక్ పాసైన యువతీ యువకులకు ఉపాధితో కూడిన ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు టెక్‌మహీంద్ర, నిర్మాణ సంస్థ ఇన్‌ఛార్జి సత్యనారాయణ ఓ ప్రకటనలో వెల్లడించారు. నగరానికి చెందిన వారై 2016, 17, 18 లో బిటెక్ ఉత్తీర్ణత సాదించిన వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. సంస్థలో 5 నెలల పాటు కోర్జావా, హెచ్‌టి ఎంఎల్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్, పిహెచ్‌పి, డిజిటల్ మార్కెటింగ్ లలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు మార్చి 20 లోపు రాజీవ్‌నగర్ చౌరస్తా సమీపంలోని టెక్‌మహీంద్ర కార్యాలయం కరూర్ వైశ్యాబ్యాంక్ సమీపంలో లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈ 7675914735, 7093 601006 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చని కోరారు.