Thursday, March 28, 2024

31వరకు రైళ్లు బంద్

- Advertisement -
- Advertisement -

Trains

 

గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ నెల 31 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, అంతర్జాతీయ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తం గా కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని పేర్కొంది. ఆ రోజుల్లో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూసివేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆరో గ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ 75 జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 3 జిల్లాలు ఉన్నా యి. అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలో పదేసి జిలాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు తెలిపింది.

కరోనా అనుమానితుల రైళ్లలో ప్ర యాణిస్తున్న సంఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం రైలు సర్వీసుల నిలిపివేత నిర్ణయం తీసుకుంది. వీరిలో కొదరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రైల్వే ఇప్పటికే పలు రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. జనతా బంద్ కారణంగా ఆదివారం దేశవ్యాప్తం గా ప్రధాన రైలు సర్వీసులన్నిటినీ అర్ధరాత్రి వరకు రద్దు చేసింది. అయితే ఇప్పటికే బయలుదేరిన రైళ్లు గమ్యస్థానాలకు చేరేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. కాగా తా జాగా ఈ నెల 22వ తేదీ (ఆదివా రం) అర్ధరాత్రినుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఏ ప్యాసింజర్ రైలు కూడా నడవదని భారత రైల్వే ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే నామమాత్రంగా సబర్బన్ రైలు సర్వీసులు, కోల్‌కతా మెట్రో సర్వీసులు ఆదివారం అర్ధరాత్రి వరకు నడుస్తాయి.

ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు వాటిని కూడా నిలిపివేయడం జరుగుతుంది అని ఆ ప్రతినిధి తెలిపారు. ప్రీమియం రైళ్లతో పాటుగా అన్ని ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్ రై ళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైల్వేసర్వీసులన్నిటినీ ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు రద్దు చేస్తున్నట్లు ఆ ప్రతినిధి స్పష్టం చేశా రు. అయితే దేశంలోని వివిధ ప్రాం తాలకు నిత్యావసర సరకుల రవా ణా కొనసాగడం కోసం గూడ్స్ రైళ్ల రాకపోకలు మాత్రం కొనసాగుతాయని ఆ ప్రతినిధి చెప్పా రు. కాగా ఈ సమయంలో రద్దయిన అన్ని రైళ్ల కు జూన్ 21 వరకు పూర్తి రిఫండ్ ను ప్రయాణికులు క్లెయిమ్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలియజేసింది. ఎలాంటి ఇ బ్బందులూ లేకుండా రిఫండ్ చెల్లింపులు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.

 

Trains stop up to 31
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News