Thursday, April 25, 2024

ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

ACB

హైదరాబాద్ : నగరంలోని మారేడ్‌పల్లిలో ట్రాన్స్‌కో లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబు మంగళవారం తన కార్యాలయంలో రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కాడు. కట్టెబోయిన మహేశ్ అనే వ్యక్తి వారసీగూడలోని త్రీఫేస్ విద్యుత్ మీటర్ మంజూరు చేయాలని కోరుతూ లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబు సంప్రదించడంతో రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో మహేశ్ రూ. 4వేల రూపాయలు లంచం ఇచ్చేవిధంగా లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబుతో ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం మహేశ్ తనను లంచం అడిగిన అధికారి వివరాలతో ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఈక్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎసిబి అధికారులు సబ్‌స్టేషన్ వద్ద రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబును రెడ్ హ్యాండెడ్‌గా పట్టున్నారు. అనంతరం లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబు చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించిన ఎసిబి అధికారులు అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు లంచం తీసుకున్న కేసులో లైన్ ఇన్సెక్టర్ సురేశ్‌బాబు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇదిలావుండా లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎసిబి అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

Transco Employees in ACB Trap At Marredpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News