Home సూర్యాపేట కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు రైతులకు తప్పని తిప్పలు

కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు రైతులకు తప్పని తిప్పలు

 Transfarmers  Burning  Problems Farmers Facing

ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో ఒకటి రెండు భారీ వర్షాలు కురియడంతో రైతులు వరినార్లు పోసుకున్నారు. నారు మడులలో నారు ఏపుగా పెరుగు తున్న తరుణంలో నెలలో వరుసగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మూడు సార్లు  కాలిపోవడంతో పోసిననారు మడిలో నీరు లేక నెర్రెలు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కర్విరాల గ్రామ శివారులో వ్యవసాయ బావుల కోసం బిగించిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మొదట కాలిపోగా ట్రాన్స్‌ఫార్మర్  రిపేరు కోసం ఒక్కొక్క మోటారుకు 150 రూపాయల వరకు వసూలు చేసి రిపేరు చేయించామని రైతులు తెలిపారు.ఈ  రైతులు కమలయ్య ,శ్రీనులు మాట్లాడుతూ తమ గోడు పట్టించుకునే వారే లేరని అన్నారు. తాము పోసిన వరి నారు నీరు లేక నెర్రెలు పట్టిందని ఆవేదన తెలిపారు.

మనతెలంగాణ/తుంగతుర్తి: ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో ఒకటి రెండు భారీ వర్షాలు కురియడంతో రైతులు వరినార్లు పోసుకున్నారు. నారు మడులలో నారు ఏపుగా పెరుగుతున్న తరుణంలో నెలలో వరుసగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మూడు సార్లు కాలిపోవడంతో పోసిన నారు మడిలో నీరు లేక నెర్రెలు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల పరిధిలోని కర్విరాల గ్రామ శివారులో వ్యవసాయ బావుల కోసం బిగించిన విద్యుత ట్రాన్స్ ఫార్మర్ మొదట కాలిపోగా ట్రాన్స్ ఫార్మర్ రిపేరు కోసం ఒక్కొక్క మోటారుకు 150 రూపాయల వరకు వసూలు చేసి రిపేరు చేయించారని రైతులు తెలిపారు. రిపేరు అయిన ట్రాన్స్ ఫార్మర్ బిగించిన మరుసటి రోజే తిరిగి పనిచేయడం లేదని షెడ్‌కు తీసుకు వెళ్ళాలని సంబంత లైన్‌మెన్ తెలిపాడని రైతులు తెలిపారు. తిరిగి రైతులు మరోమారు డబ్బుల పోగు చేసుకుని ,ట్రాన్స్ ఫార్మర్‌ను షెడ్‌కు తీసుకుని వెళ్లగా షెడ్‌లో రిపేరు చేసి ఇవ్వడంతో తిరిగి తెచ్చిన ట్రాన్స్ ఫార్మర్‌ను విద్యుత్ అధికారులు మళ్ళీ బిగించారు. కాగా రెండు మూడు రోజులు సజావుగా పని చేసిన ట్రాన్ ఫార్మ ర్ మళ్ళీ పని చేయడం లేదని ఇదేమిటని విద్యుత్ అధికారులను అడగామని తిరిగి ట్రాన్స్ ఫార్మర్ షెడ్‌కు తీసుకువెళ్ళాలని అంటున్నారని ,తాము ఇలా ఎన్నిసార్లు షెడ్ల చుట్టు తిరిగాలని ,షెడ్లలో అడిగే డబ్బులు ఎన్ని సార్లు ఇవ్వాలని ,రైతులు కమలయ్య,శ్రీను,తదితరులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయ మై రైతులు కమలయ్య ,శ్రీనులు మాట్లాడుతూ తమ గోడు పట్టించుకునే వారే లేరని అన్నారు. తాము పోసిన వరి నారు నీరు లేక నెర్రెలు పట్టిందని ఆవేదన తెలిపారు. తమకున్న మోటార్లకు 150 చొప్పున వసూలు చేశారని, కాని ట్రాన్స్‌ఫార్మర్ మాత్రం బాగుపడలేదని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ రిపేరుకు షెడ్డులో డబ్బులు ఇవ్వాలని తీసుకుంటున్నారని, కొంత మంది డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు ట్రాన్స్‌ఫార్మర్ రిపేరులో వసూలు చేస్తున్నారని అసలు ట్రాన్స్‌ఫార్మర్ రిపేరులో డబ్బుల వసూలు ఏమిటని రైతులు అంటు న్నారు. విద్యుత్ ఉన్నతాధికారులు ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి రైతుల నుండి వసూలు అవుతున్న డబ్బులు ఎవరికి చేరుతున్నాయో తేల్చాలని రైతులు కోరుతున్నారు. గత పది రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా విద్యుత్ అధికారుల్లో చలనం లేదని ,రైతులకు 24 గంటల విద్యుత్ అంది స్తున్న పాలకులు విద్యుత్ అధికారుల నిర్లక్షం పై చర్యలు తీసుకోవా లని కోరారు. ఇకనైన కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో మంచి ట్రాన్స్ ఫార్మర్ ,బిగించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.