Home తాజా వార్తలు ఆర్ టిసి సమ్మె … సాయంత్రం ఆరు దాటితే ఇంటికే : పువ్వాడ

ఆర్ టిసి సమ్మె … సాయంత్రం ఆరు దాటితే ఇంటికే : పువ్వాడ

Transport Minister Puvvadaహైదరాబాద్‌ : తెలంగాణలో టిఎస్ ఆర్ టిసి కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కార్మికులు మాత్రం సమ్మె చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆర్ టిసి సమ్మెపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ శనివారం మాట్లాడారు. శనివారం సాయంత్రం ఆరు గంటల లోగా విధుల్లో చేరని వారు ఆర్ టిసి ఉద్యోగులు కారని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో చేరని వారిని భవిష్యత్ లో కూడా ఆర్ టిసి ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని ఆయన తేల్చి చెప్పారు. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా శాశ్వతంగా ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, మూడు వేల నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్ టిసి బస్సులు నడపడానికి లైసెన్స్ లు ఉన్న యువత నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగాలు కలిపించడంతో పాటు వారికి తక్షణ శిక్షణ ఇస్తామని, ఈ క్రమంలో బస్సులు యథాతథంగా నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సుమారు ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తామని, శనివారం సాయంత్రం వరకు పరిస్థితిని గమనించి , అందుకు తగిన ప్రత్నామ్నాయ ఏర్పాట్లను చేస్తామని పువ్వాడ స్పష్టం చేశారు.

Transport Minister Puvvada Warned The RTC Workers