Wednesday, April 24, 2024

విమాన ప్రయాణికులలో 20-29 వయస్కులే అధికం

- Advertisement -
- Advertisement -
Travel Intent Survey by AirAsia India
ఎయిర్‌ఆసియా సర్వే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించిన తర్వాత విమాన ప్రయాణం సాగిస్తున్న వారిలో అత్యధికులు 20-29 మధ్య వయస్కులే ఉన్నట్లు ఎయిర్‌ఆసియా ఇండియా నిర్వహించిన ఒక తాజా సర్వేలో వెల్లడైంది. దాదాపు 2,400 మంది ప్రయాణికులపై ఇటీవల సర్వే నిర్వహించిన ఎయిర్‌ఆసియా& లాక్‌డౌన్‌కు ముందు 25 శాతం ఉన్న 20-29 మధ్య వయస్కులైన విమాన ప్రయాణికుల సంఖ్య లాక్‌డౌన్ తొలగించిన తర్వాత 42 శాతానికి పెరిగిందని గుర్తించింది. కాగా..30-39 మధ్యవయస్కులైన ప్రయాణికుల సంఖ్య లాక్‌డౌన్ తర్వాత 49 శాతం నుంచి 41 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలిందని ఎయిర్‌ఆసియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత విమాన ప్రయాణం సాగిస్తున్న మొత్తం ప్రయాణికులలో కేవలం 10 శాతం మంది మాత్రమే 40 ఏళ్లు దాటిన వారు ఉన్నట్లు సర్వే గుర్తించింది. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత రెండు నెలల విరామంతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌ఆసియా ఇండియా ఎయిర్‌లైన్స్ సంస్థ మొత్తం 31 ఎ320 విమానాలను దేశంలోని 19 ప్రదేశాలకు నడుపుతోంది.

Travel Intent Survey by AirAsia India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News