Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రాణహిత చేవెళ్ల కాలువతో ప్రయాణికులకు పరేశాన్

ప్రాణహిత చేవెళ్ల కాలువతో ప్రయాణికులకు పరేశాన్

 pranahitha canal water

 

బెజ్జూరు : ప్రాణాహిత చేవేళ్ల కాలువ నీరు ప్రవాహంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూరు మండలంలోని సలుగుపల్లి నుండి బారేగూడ, చింతలమానే పల్లి మండలనికి వెళ్లే ప్రజలు, ఆంతేకాకుండ సలుగుపల్లి నుండి కుంటలమానేపల్లి, డబ్బా, కౌటాల వెళ్లే ప్రయాణికులకు వర్షాలు కురిసినట్లయితే ఈ రహదారి గుండ వెళ్లే ప్రజలు ప్రాణహిత చేవేళ్ల కాలువ ప్రవహంతో రహదారి నుండి ప్రవాహించడంతో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలకు రాకపోకలు స్థంబించి వరద నీరు తగ్గే వరకు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలం ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

గత 50 రోజులుగా బస్సులు ఇతర వాహానాలు సైతం ఈ రహాదారి గుండ వెళ్లలేని పరిస్థితిగా ఉన్న తరునంలో ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలు పడుతున్న తిప్పలను బెజ్జూరు ఎస్‌ఐ వెంకటేశ్ స్పందించి కల్వర్టు వద్ద, గుంతలు పడ్డా రహాదారికి మురుము, కాంక్రట్ వేసి మరమ్మత్తులు చేయించారు. దీంతో కౌటాల వయా డబ్బా నుండి వచ్చే బస్సులు ప్రారంభం ఆయిన సంగతి తెలిసిందే. కాని మళ్లి గత రెండు రోజులుగా కురుస్తున్న ఎకధాటి వర్షానికి రహాదారి నుండి ప్రాణాహిత చేవేళ్ల కాలువ నుండి వచ్చే వరద ప్రవాహంతో రహాదారి నుండి వరద నీరు ప్రవాహించడంతో రకపోకలు నిలిచిపోయాయి.

దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూసి పలు ఈతగాళ్ల సహాయంతో డబ్బులు చెల్లించి బయటపడ్డారు. ఆంతేకాకుండ సుస్మిర్ ఓర్రే ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైన సంబంధిత ఆధికారులు స్పందించి సలుగుపల్లి వద్ద నుండి ప్రవహిస్తున్న ప్రాణహిత చేవేళ్ల కాలువను తీగల ఓర్రే వైపుకు ప్రాణహిత చేవేళ్ల కాలువను మళ్లించాలని ఆయా గ్రామాల ప్రజలు కొరుతున్నారు. ఇలానే వరద ప్రవహించినట్లయితే తాము వేసుకున్న వరీ, పత్తి పంటలు సైతం వరద ప్రవహానికి నష్టం వాటిల్లుతుందని వారు పేర్కోన్నారు.

Travelers dificulties with the flow of pranahitha canal water