Friday, March 29, 2024

‘హరిత’రునగరం

- Advertisement -
- Advertisement -

Tree City of the World 2020 Award for Hyderabad

హైదరాబాద్‌కు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 అవార్డు

భారత్ నుంచి అవార్డు గెలుచుకున్న ఏకైక నగరం
నాలుగేళ్లుగా 2,76,97,967 మొక్కలు నాటిన సిటీ
హరితహారం వల్లనే సాధ్యమయ్యింది : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో: హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జా గ్రత్తలు తీసుకుంటున్నందుకు ఈ గుర్తింపు లభించింది. ఈక్రమంలో ఎఫ్‌ఏఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రపంచంలోని 63 దేశాల నుంచి 120 నగరాలు పరిశీలించాయి. వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ప్రకటించాయి.

వీటిలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. భాగ్యనగరానికి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్ట్’గా గుర్తింపు దక్కడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. హరితహారం వల్లే ఇది సా ధ్యమయ్యిందని ఆయన తెలిపారు. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు మానస పుత్రిక అయి నా తెలంగాణకు హరితహారం కార్యక్రమం సత్ఫాలితాలే ఈ అవార్డుకు నాంది పలికాయి. 2016కు ముందు కాంక్రీట్ జంగల్‌ను తలపించిన నగరం నేడు ఆకాశ హర్మాన్యల మధ్య చెట్ల రూపంలో ఆ కు పచ్చని మైదానాలను సృష్టించడం ద్వారా ప్రప ంచ నగరాలకు ధీటుగా నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. హరిత హారంలో భాగంగా నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో 2,76,97,967 మొక్కలను నాటడంతో పాటు పంపిణీ చేశారు. 2016 నుంచి 2020 వరకు 3 కోట్ల మొక్కలు తనాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటారు. 2020,-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలన్న లక్షం నేపథ్యంలో 2.08 కోట్ల మొక్కలను పంపిణీ చేయడంతో పాటు నాటారు. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్‌లను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తద్వారా గ్రేటర్‌లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణ సృష్టించడం ద్వారా ఉష్ణోగ్రతలతో పాటు కాలుష్యాన్ని తగ్గించడం సాధ్యకానుంది. హైదరాబాద్ నగరం అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో హైదరాబాద్ ఆదర్శవంతమైన నగరంగా ప్రపంచంలోనే పలు నగరాలకు మార్గదర్శకంగా నిలిచింది.

మొక్కల మనుగడకు ప్రత్యేక చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జిహెచ్‌ఎంసితో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హరిత భవిష్యత్ కు గాను మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకై ఐదు ప్రధాన లక్ష్యాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్ -2020’ గుర్తింపుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం నగరానికి ఈ గుర్తింపునిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు ప్రకటించాయి. హైదరాబాద్ నగరం అర్బన్, కమ్యునిటీ ఫారెస్ట్రీలో ఆదర్శవంతమైన నగరంగా ప్రపంచంలోనే పలు నగరాలకు మార్గదర్శకంగా నిలిచింది.

సంతోషంగా ఉంది: మంత్రి కెటిఆర్

విజయవంతంగా కొనసాగుతోన్న హరితహారంతో తెలంగాణ పుడమితల్లి ఆకుపచ్చగా మారుతోంది. ఎక్కడ చూ సిపా పచ్చదనమే పలకరిస్తోంది. హరిత తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం లభించడం సంతోషకరమని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అర్భర్ డే ఫౌండేషన్ 2020 ట్రీ సిటీగా హైదరాబాద్‌ను ప్రకటించడం, హరితహారం విజయవంతం అయ్యిందనడానికి ఈ గుర్తింపే నిదర్శమన్నారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను ఆర్భర్ డే ఫౌండేషన్ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అర్భర్ డే ఫౌండేషన్ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైదరాబాద్ ఎంపిక కావడం విశేషమని మంత్రి తెలిపారు. హరితహారం భాగంగా హైదరాబాద్‌లో 2020 ఏడాది వరకు 2.4 కోట్ల మొక్కలను నాటినట్లు అర్భర్ ఫౌండేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరం

గతంతో పొల్చితే పెద్దసంఖ్యలో మొక్కలు, అడవులను పెం చడం ద్వారా హైదరాబాద్ మరింత ఆరోగ్యకరమైన, నివా స యోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షుడు డాన్ లాంబే అన్నా రు. 2021 మార్చి 1వ తేదీన లేదా అంతలోపే నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా ప్రకటించనున్నామని లాంబే ము న్సిపల్ శాఖకు పంపిన సందేశంలో ఆయన పేర్కొన్నారు.

గర్వంగా ఉంది : ట్విట్టర్‌లో గవర్నర్ తమిళిసై

దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్- 2020’గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌ఆర్బర్ డే ఫౌ ండేషన్ ప్రకటించడం గర్వంగా ఉందని గవర్నర్ సౌంద ర రాజన్ తమిళిసై పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం గవర్నర్ ట్వీట్ చేశారు. అర్బన్ ఫారెస్ట్ పెరగడానికి పెద్ద ఎత్తున మొక్కలు పెంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకు ంటున్నందు కు గాను ఈ గుర్తింపు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News