Wednesday, April 24, 2024

‘మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి…’

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగపూర్ టౌన్ షిప్ గేటెడ్ కమ్యూనిటీలో రజితారెడ్డితో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని మహిళలు, దీపికారెడ్డి దీపాంజలి నాట్య కళాశాల బృందం కీర్తన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్బంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు రేపటి తరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయన్నారు. మంచి ఆక్సీజన్, మంచి వాతావరణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటాం అన్నారు.ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన నటి వర్షిణి, జబర్దస్త్ సత్యశ్రీ, సింగర్ ఆర్చి రవళి అంతర్జాతీయ మహిళదినోత్సవం సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటాలని నటి వర్షిణి, జబర్దస్త్ సత్యశ్రీ, సింగర్ ఆర్చి రవళి తదితరులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News