Home ఆదిలాబాద్ హక్కుల సాధనకు ఐక్యపోరు

హక్కుల సాధనకు ఐక్యపోరు

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రత్యేక ప్యాకేజీని కోరిన నేతలు

09adutr02p1ఉట్నూర్ : జిల్లాలోని ఆదివాసీల సమస్యలను, హక్కులు, చట్టాలను ఎకతాటిపై వచ్చి జల్..జంగల్…జమీన్ కోసం పోరాటాలు చేసిన కొమురం భీం స్పూర్థిగా ఉద్యమాలు చేసి తమకు చెందాల్సిన హక్కులను సాధించుకుందామని ఆదివాసీలు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం మండల కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు. ముందుగా మండలంలోని కొమురం భీం ప్రాంగణంలోని కొమురం భీం విగ్రహాం వద్ద పూలమాలలు వేసి నివాళ్ల ఆర్పించారు. ఆదివాసీలు వారి వారి సంప్రాదాయ నృత్యాలు చేశారు. అక్కడి నుండి డోలు, వాయిద్యాలు, సన్యాయినలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు ఆర్పించి ఐటీడీఏ నుండి పాత బస్టాండ్ నుండి కొమురం భీం ప్రాంగణం ఎదుట హెచ్‌కేజీఎన్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారి ర్యాలీ నిర్వహించడం ట్రాఫిక్ జామ్ అయింది. ర్యాలీతో ఇసుక చల్లిన కూడా కిందికి రాలనంత ఆదివాసీలు పాల్గొన్నారు. అనంతరం గార్డెన్‌లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉట్నూర్ ఆర్డీవో ఐలయ్య హజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్బంగా వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మా వనరులు, ఉద్యోగాలు, నీరు, హక్కులు, చట్టాలు తమకే ఇవ్వాలన్నారు. ఆదివాసీల సమాజాం ఉందని ప్రభుత్వానికి తెలియజేయలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై చిన్నచూపు చుడడం సరికాదన్నారు. తమకు రావాల్సిన రిజర్వేషన్లు, హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

09adutr02p7ఇప్పటికై అభివృద్ధికి అమడ దూరంలో ఆదివాసీలు ఉన్నరని దింతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర కూలాలలను ఎస్టీలో చేర్చే కుట్ర పన్నుతున్నరన్నారు. ఆదివాసీలు విధ్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నరన్నారు. ప్రతి దాంట్లో ఆదివాసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు. ఆదివాసీలు మరింత అభివృద్ధి సాధించలంటే ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజ్యంగం కల్పించిన ఆదివాసీ చట్టాలను పకడ్బందిగా అమలు చేయలన్నారు. అభివృద్ధి చెందిన ఖైతిలంబాడాలను, వాల్మికి బోయలను ఎస్టీ జాబితలో చేర్చె చెల్లప్ప కమిటిని రద్దు చేయలన్నారు.

హరిత భారం పెరిట సాగు భూముల నుండి ఆదివాసీలను వెళ్లగోట్టే ప్రయత్నం మానుకోవాలి. ఆటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసులు సాగు చేస్తున్న భూములన్నింటికి పట్టాలివ్వాలన్నారు. ఆదివాసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి ప్రత్యే చట్టం తీసుకవచ్చేందుకు 5, 6వ షెడ్యూల్డ్ కల్పించినప్పటికి ఏజెన్సీ ప్రాంతం కోసం రూపోందించిన చట్టాలు, భూ బదలాయింపు నిషేద చట్టాన్ని, 1/70 పీసా చట్టం, ఆటవీ హక్కుల చట్టం ఉన్నప్పటికి నేటికి అమలుకాకపోవడం వల్ల ఆదివాసీలు అభివృద్ధి సాగించడం లేదన్నారు. జీవో నెం.3 ని అమలు చేస్తూ అన్ని రకాల ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలన్నారు. ఆర్టికల్ 342లో పెర్కోన్న ఆదివాసీ తెగలను మాత్రమే 1950 ఎజెన్సీ పత్రాలు ఇవ్వాలన్నారు. ఆదివాసీ మహిళలలో అఘాత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నయని వీటిని ఆరికట్టేందుకు రక్షణ కల్పించడంతో పాటు బాలిక పాఠశాలల్లోని మహిళ ఉపాధ్యాయులనే నియమించాలన్నారు. ఆదివాసీలను నిర్వాసితులను చేసే టైగర్‌జోన్, ఓపెన్‌కాస్ట్, భారి నీటి పారుదల ప్రాజెక్ట్‌లను వెంటనే రద్దు చేయలని డిమాండ్ చేశారు.

అదే విధంగా 1975-76 సంవత్సరంలో వలస వచ్చిన లంబాడీలను ఎస్టీ జాబిత నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ దినోత్సవంలో ఆదివాసీ సంఘాల సమాఖ్య సభ్యులు మెస్రం దుర్గు, కనక యాదవ్‌రావ్, వెడ్మ బోజ్జు, మర్సుకొల తిరుపతి, కనక లక్కెరావ్, ఆత్రం భుజంగ్‌రావ్, సుగుణ, సెడ్మాకి సీతారాం, కనక వెంకటేశ్వర్‌రావ్, బోంత ఆశారెడ్డి, చంద్రబాన్, మానిక్‌రావ్, శేఖర్, రమేశ్, గంగారాం, రేఖా, తులసిరాం, అర్జున్, రమ, మదు, జలఫత్, బాదిరాం, మోతిరాం, ఐటీడీఏ ఎపీవో జనరల్ కుంర నాగోరావ్, ఎవో భీం, పీఈటీసీ ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్‌లతో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.