Thursday, April 25, 2024

మొండెం నుంచి తలను వేరు చేసి… తలతో సెల్ఫీ

- Advertisement -
- Advertisement -

రాంచీ: భూవివాదంలో 20 ఏళ్ల యువకుడిని చంపి మృతదేహం నుంచి తలను వేరుచేసి 15 కిలో మీటర్ల దూరంలో పడేసి అనంతరం తలతో సెల్ఫీ దిగిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ఖుంటి జిల్లాలో జరిగింది. ఈ హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనుముండా కుటుంబానికి- సాగర్ ముండా కుటుంబానికి భూముల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. డిసెంబర్ 1న ఇంట్లో వాళ్లు పొలం పనులకు వెళ్లినప్పుడు 20 ఏళ్ల కను ముండా ఒక్కరే ఇంటి దగ్గర ఉన్నాడు. సాగర్ ముండా తన స్నేహితులతో కలిసి కను ముండాను ఎత్తుకెళ్లారు. కనుముండా కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి కుమారుడు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

గ్రామస్థుల సమాచారం మేరకు సాగర్ ముండాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కనుముండా హత్య చేసిన అనంతరం మృతదేహం నుంచి తలను వేరు చేశామన్నారు. మొండాన్ని కుంపాంగ్ గోప్లా అటవీ ప్రాంతంలో పడేయగా, అక్కడ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో గల దుల్వా తుంగ్రి ప్రాంతంలో తలను పడేశామని నిందితులు తెలిపారు. తలతో నిందితులు సెల్ఫీ దిగారు. పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుల వద్ద నుంచి పదునైన ఆయుధాలు, గొడ్డలి, ఎస్‌యువి కారును స్వాధీనం చేసుకున్నారు. భూవివాదం విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News