Home ఖమ్మం ఖమ్మంలో పోడు భూముల వివాదం

ఖమ్మంలో పోడు భూముల వివాదం

Tribals fighted with forest officers on podu lands lands

 

ఖమ్మం: సత్తుపల్లి మండలం రేగుళ్లపాడులో ఫారెస్ట్ సిబ్బంది, పోడు రైతుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. పోడు భూముల్లో వ్యవసాయ పనులు చేస్తున్న గిరిజన రైతులను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకొన్నారు. దీంతో పారెస్ట్ అధికారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరు మహిళా పారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల్లో పారెస్ట్ అధికారులకు, భూమిపై ఆధారపడిన రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై గిరిజన ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ పోడు భూముల సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా సిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని సిఎం అసెంబ్లీ వేదికగా కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tribals fighted with forest officers on podu lands lands