Saturday, April 20, 2024

పెద్దపులిని వెంటనే పట్టుకోవాలి…

- Advertisement -
- Advertisement -

Tribes demanding immediate capture of tiger in Bejjur

బెజ్జూరు: పెద్దపులిని వెంటనే పట్టుకోవాలని అదివాసి నాయకులు బస్టాండ్ ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. బెజ్జూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ప్రాంతం నుండి ర్యాలీగా వచ్చి బస్టాండ్ ప్రాంతంలో గురువారం అదివాసి నాయకులు పలువురు నాయకులు, గిరిజన నాయకులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సహాకార సంఘం చైర్మన్ హర్షద్ హుస్సేన్, తెరాస మండల అధ్యక్షులు సకారం, తెలంగాణ అదివాసి గిరిజన సంఘం నాయకులు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ మనుషుల రక్తానికి రుచి మరిగిన పులులను బందించి గిరిజన గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూరు, దహేగాం, పెంచికల్‌పేట్ మరియు కర్జేల్లి తదితర అటవీ ప్రాంతంలో ఇటివల పులుల సంచారం పెరిగి పశువులతో పాటు మనుషులపై దాడి చేస్తు లెక్కలేని పశువులతో పాటు ఇద్దరు గిరిజనుల ప్రాణాలు సైతం బలికోందని వారు అన్నారు.

గత నెల 11 న దిగడ గ్రామానికి చెందిన విగ్నేష్ అనే యువకుడిని పులి హతమర్చగా, నవంబర్ 29 న కోండపల్లిలో నిర్మల అనే బాలికను పులి పత్తి చేనులో వేటాడి చంపేసిందని వారు అన్నారు. విగ్నేష్ ఘటనపై అటవీ శాఖ ఉన్నత అధికారులు స్థానికంగా వచ్చి పులిని 15 రోజుల్లో పట్టుకోని తీరుతామని ఇలాంటి ఘటనలు పునరవృత్తం కాకుండా చూస్తామని చెప్పినప్పటికి అ మాటలు వినడానికే తప్ప పనితనంలో లేదని మండిపడ్డారు. కాని కోద్ది రోజులకే మరో ఘటనతో నిర్మల మరణించడం ఆయా గ్రామాలలో భయందోళన వాతవరణం నెలకోందని వారు అన్నారు. పులి దాడిలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి, అటవీ శాఖ అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదని వారు అన్నారు. అటవీ ప్రాంతాలలో కాకుండా చేనులలోక వస్తు పులులు మనుషులను వేటాడి చంపుతున్నాయని అన్నారు. దీనికి అటవీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఎలా రక్షణ కల్పిస్తారో తెలియజేయాలని అన్నారు. గిరిజన ప్రజల బతుకు దేరువు కోసం చేను, చెలక, అటవీ ప్రాంతాలలో సైతం తిరుగుతు ఉంటారు.

ఈ నెపథ్యంలో రక్షణ లేక ఇబ్బందులు పడక తప్పడం లేదని వారు అన్నారు. పులులను మీరు పట్టుకోనట్లయితే మరో దాడితో మనిషి మరణించినట్లయితే తక్షణ కర్తవ్యంగా మేము మా ప్రాణ రక్షణ కోసం పులులను హతమార్చాల్సి వస్తుందని మండిపడ్డారు. వన్యప్రాణులను వేటాడితే కేసులు పెడతారు కాని చేనులలోకి వచ్చే పులులు వేటాడి చంపితే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఇప్పటికైన పులులను వెంటనే పట్టుకోని రక్షణ కల్పించాలని, లేని యోడల పెద్ద ఎత్తున అందోళనతో పాటు పులులను హతమార్చడం జరుగుతుందని, గిరిజనుల అధ్వర్యంలో హెచ్చరించారు. మాపై కేసులు పెడితే ఊరుకోమని అన్నారు. కావున ఈ విషయమై అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. అనంతరం తహసీల్దార్ రవిందర్‌నాయక్, డిప్యూటి రేంజర్ శీలానంద్, ఎస్‌ఐ సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లో పులిని పట్టుకోవాలి లేదా అదివాసి గిరిజన నాయకులే పులిని పట్టుకోని ఫారేస్ట్ అధికారులకు అప్పగించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పంద్రం పుష్ఫలత, సహాకార సంఘం వైస్ చైర్మన్ ఇస్తారి, అదివాసి జిల్లా కమిటి సభ్యులు వెంకటేశ్, కోఅప్షన్ సభ్యులు బషరత్ ఖాన్, సర్పంచ్‌లు హన్మంతు, సంతోష్, శ్రీనివాస్, సాయి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tribes demanding immediate capture of tiger in Bejjur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News