Home తాజా వార్తలు త్రిష, అంజలిల మధ్య క్యాట్‌ఫైట్

త్రిష, అంజలిల మధ్య క్యాట్‌ఫైట్

TrishaCph12-anjali- Pathసినీ రంగంలో అందాలభామలు కొందరికి ఒకరంటే ఒకరు అస్సలు పడదు. ముఖ్యంగా టాప్ హీరోయిన్ల మధ్య ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కోలీవుడ్‌లో ఈమధ్యన త్రిష, అంజలిల మధ్య క్యాట్ ఫైట్ నడుస్తోందట. తాజాగా వీరిద్దరూ జయం రవి హీరోగా చేస్తున్న సినిమా ‘సకల కళా వల్లవన్’లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో తనకంటే త్రిషకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఆమెపై అంజలి ఎంతో కోపంగా ఉందట. దీంతో త్రిష కూడా అంజలిపై ఆగ్రహిస్తోందట. సినిమా పూర్తికావడంతో ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇద్దరు అందాల భామలు కలిసి నవ్వుతూ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.