Home తాజా వార్తలు త్రిషకు లక్కీ ఆఫర్

త్రిషకు లక్కీ ఆఫర్

Trisha

 

‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ త్రిష. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. నిజానికి త్రిష కెరీర్ తమిళంలో ప్రారంభమైంది. ‘జోడి’ సినిమాతో త్రిష కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గానే చెలామణీ అయింది. తెలుగులో యంగ్ హీరోలతో పాటు చిరంజీవితో సహా అగ్ర హీరోలందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం తెలుగులో త్రిష హవా అంతగా లేదు కానీ తమిళంలో హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తో ఈ బ్యూటీ జోరు చూపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అంటే తెలుగులో త్రిష మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందన్న మాట. ఈ ప్రచారంపై అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది అందాల తార త్రిష. ఇక తమిళంలో ఈ భామ చేస్తున్న ప్రాజెక్టులు అర డజనుకు పైగానే ఉండడం విశేషం.

Trisha in Mohanlal movie