Home గాసిప్స్ అలాంటిదేమైన ఉంటే ముందు మీకే చెబుతా..!

అలాంటిదేమైన ఉంటే ముందు మీకే చెబుతా..!

Actress Trisha Krishnan

చెన్నై: లవర్ బాయ్ తరుణ్ కు జోడిగా ‘నీ మనసు నాకు తెలుసు’ అనే చిత్రంతో చెన్నై బ్యూటీ త్రిష టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ హీరోగా వచ్చిన ‘వర్షం’ మూవీలో నటించిన త్రిష కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ‘వర్షం’ సినిమా తరువాత త్రిషకు వెనకకు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరీతోనూ జతకట్టేసింది. దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ హోదాలో వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. గత రెండు దశాబ్దాలుగా యావత్ సినిమా ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తూనే ఉంది.

కొత్త కథనాయికలు ఎంతమంది వచ్చిన త్రిష మాత్రం ఇంకా అవకాశాలు అందుకుంటూనే ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అనే తేగా లేకుండా అన్నీ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల తమిళంలో ’96’ అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రిష మరోసారి తన చరిష్మాను చాటుకుని వార్తల్లో నిలిచింది. ఇలా తన సినిమా కెరీర్ ను గత రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తోందీ తమిళ బ్యూటీ. అయితే, గత కొంతకాలంగా త్రిష పెళ్లి ఫై రకరకాలుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య త్రిష ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కాబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ కథనాల నేపథ్యంలో పెళ్లిఫై ఓ క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న త్రిష తాజాగా ఈ వార్తల ఫై స్పందించింది. తన పెళ్లి గురించి మీడియాలో వస్తున్న కథనాలన్నీ పుకార్లేనని చెబుతోంది త్రిష. తన మనసుకు నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదని చెబుతోంది. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక మూడేళ్ల క్రితం త్రిష ఎంగేజ్మెంట్ వ్యాపారవేత్త, నిర్మాత అయిన వరుణ్ మణియన్ తో జరిగింది. కానీ, పెళ్లి కూడా నిశ్చయమై చివరి నిమిషంలో ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష ఒంటరిగా ఉంటుంది. ఇదిలాఉండగా త్రిష చాలా రోజుల తర్వాత త్వరలోనే ఓ తెలుగు మూవీలో నటించబోతున్నట్లు తెలిపింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ’96’ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేయబోతున్న విషయం విదితమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రీమేక్ లో త్రిషనే హీరోయిన్ పెట్టుకోవాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది.

Trisha Krishnan speaks about her Marriage Gossips

Telangana Breaking News