Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ ముమ్మర ప్రచారం

టిఆర్‌ఎస్ ముమ్మర ప్రచారం

TRS Campaign

యదాద్రి భువనగిరి: మండలంలో టిఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమంలో బాగంగా శుక్రవారం లోతుకుంట,నర్సాయగూడెం, అరూర్, వేములకొండ, చిత్తాపురం, జంగారెడ్డి పల్లి, మొగిలిపాక గ్రామాలలో ప్రచారంలో  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్ది డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. భువనగిరికి సైనిక్ స్కూల్,పాస్ పోర్ట్ ఆఫీస్,కేంద్రీయ విద్యాలయం,ఎయిమ్స్, భద్రాద్రి వరకు నాలుగు రోడ్ల జాతీయ రహదారి వంటి పలు పథకాలను సాధించిన ఘనత బూర నర్సయ్యగౌడ్‌దేనని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని, బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించే బాద్యత సిఎం కెసిఆర్ మన మీద ఉంచారని, అందుకే నర్సయ్యగౌడ్ ను గెలిపించాలని ఆయన కోరారు.

కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేస్తే అటు రాహుల్ కు ఇటు మెడీకి లాభం తప్పా ఎవరికి లాభం వుండదని, టిఆర్‌ఎస్ మన ఇంటి పార్టీ అని,  మన కారు గుర్తుకు ఓటు వేస్తే మన తెలంగాణకు లాభమని తెలిపారు. ఈ క్రమంలోనే  బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శ్రీరాముల నాగరాజు,జడ్‌పిటిసి మొగిళ్ల శ్రీనివాస్,వంగాల వెంకన్న గౌడ్,పనుమటి మమతారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండరీ,పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల రవీందర్,మాజీ ఎంపిపి చిట్టెడి జనార్దన్ రెడ్డి,తుమ్మల దామోదర్, అయిటి పాముల సత్యనారాయణ, అయిటి పాముల ప్రభాకర్, మారగోని జంగాలు గౌడ్,పల్సం రమేశ్,పిశాటి అంజిరెడ్డి,మాద శంకర్ గౌడ్,ముద్దసాని కిరణ్‌రెడ్డి, బైకానిముత్యాలు ,కొడితాల నాగరాజు,గొడుగు నర్సింహ్మ,బాలశంకర్,మర్రి వెంకటేశం,మాదాను బాలశౌరీ,రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

TRS Campaign in YadadriBhuvanagiri