స్టేషన్ ఘన్పూర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తానే విజయం సాధిస్తానని స్టేషన్‌ఘన్‌పూర్ టిఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. తాటికొండలో శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేళ్లలో సిఎం కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. అధికార దాహంతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ వందకు పైగా స్థానాలు సాధిస్తుందని, మళ్లీ కెసిఆర్ సిఎం అవుతారని ఆయన తేల్చి చెప్పారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన టిఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. రాజయ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.