Home తాజా వార్తలు ఉత్తమ్, పద్మావతిపై ఈసికి ఫిర్యాదు

ఉత్తమ్, పద్మావతిపై ఈసికి ఫిర్యాదు

Uttam, Padmavathi

 

హైదరాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతిపై ఎలక్షన్ కమిషన్ కు టిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను కలిసి మూడు ఫిర్యాదులను చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అనుచరుల ద్వారా డబ్బులను పంపిణి చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. ఆలయం కోసం చెక్కు ఇచ్చారని, మెటుపల్లి మండలం భీమ్ ల తండాలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రచారం చేశారని, పలువురిని పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరేడు చర్ల మండలం ఓ చర్చితో  ఉత్తమ్, పద్మావతి పార్టీ పోస్టర్లు, కండువలతో సమావేశమై పలు హమీలు ఇచ్చారని వెల్లడించారు. విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారం చేసిన ఉత్తమ్, పద్మావతిపై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ నేతలు కోరారు. ఫిర్యాదుతోపాటు, పలు ఆదారాలు సమర్పించారు.

TRS Complaint to EC on Uttam, Padmavathi