Friday, March 29, 2024

కమలం కనికట్టు నేతకు కటకటాలు

- Advertisement -
- Advertisement -

TRS complaint to Election Returning Officer

 

దుబ్బాకలో జరగని ఘటనను జరిగినట్టుగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు

బిజెపి నేత ఎల్ శ్రీనివాస్‌నాయక్ అరెస్టు
వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టిఆర్‌ఎస్ ఫిర్యాదు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని వినతి

మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక నియోజక వర్గం ఉప ఎన్నికల్లో లబ్ది పొందడానికి సోషల్ మీడియాలో కనికట్టు విద్యను ప్రదర్శించిన బిజెపి నేత కటకటాల పాలైన సంఘటన ఇది. దుబ్బాక నియోజక వర్గంలో జరగని ఘటనను జరిగినట్లుగా తప్పు డు, మాయదారి ప్రచారం చేసిన బిజెపి నేత లావుడ్య శ్రీనివాస్ నాయక్‌ను దుబ్బాక పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈక్రమంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికా రి చెన్నయ్య ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. 2019లో ఎక్కడో జరిగిన గద్దె కూల్చివేత సంఘటనను దుబ్బాకలో జరిగినట్టుగా ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలే కూల్చివేసుకున్నట్టుగా ఫేస్ బుక్, సోష ల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన బిజెపి నాయకు డు శ్రీనివాస్‌పై పోలీసులు నంబర్ 299/ 2020 యు/ ఎస్ 153,153(ఎ),505 (2) ఐపిసి సెక్షన్ 125 ఆర్‌పి యాక్ట్, సెక్షన్ 66 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసునమోదు చేశారు. ఎన్నికల సమయంలో సున్నితమైన అంశాలను ప్రచారం చేపడుతూ రెండు వర్గాల మధ్య వర్గవైషమ్యాలు సృష్టించేందుకు పెద్ద ఎత్తున కుట్రపన్నిన నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఈక్రమంలో పోలీసు విచారణలో 2019 సంవత్సరం ఫిబ్రవరిలో ఎక్కడో ఒక గద్దె కూల్చిన ఘటనకు సంబంధించిన పాత వీడియో క్లిప్ ను ధర్పల్లి బిజెపి మండల కార్యదర్శి శ్రీనివాస్ సేకరించినట్లు తేలిం ది. తొలుత ఈ గద్దెను కూల్చిన ఘటనకు సంబంధించిన వీడియోలను ధర్పల్లి మండలంలోని స్వగ్రామమైన వాడి మి తాండాలో నిందితుడు లాడన శ్రీనివాస్‌నాయక్ 17. 10.20న తన కామెంట్ జతచేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడని దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ ఘటన ఏమా త్రం సంబంధంలేకపోయినా దుబ్బాకలో జరిగినట్లుగా తన కనికట్టు విద్యతో చిత్రీకరించాడని, నిందితుడు శ్రీనివాస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి పోస్ట్ చేసిన కామెంట్ రెండు వర్గాల మధ్య వర్గవైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఉప ఎన్నిక ల సమయంలో నిందితుడు దుబ్బాక నియోజక వర్గంలో చోటుచేసుకోని ఘటను ఇక్కడే జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని దర్యాప్తు అధికారులు వివరిస్తున్నారు.

దీంతో నిందితుడు శ్రీనివాస్‌ను ఆదివారంనాడు తన స్వగ్రామంలో అదుపులోకి తీసుకుని అతని వద్దనుండి తన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు శ్రీనివాస్ తన మొబైల్ ఫోన్ నుంచి పంపిన పాత వీడియో క్లిప్స్‌లకు తన కామెంట్ జతపరిచడంతో పాటు అతని ఫోన్‌కు వచ్చిన కామెంట్స్‌ను మధ్యవర్తుల ముందు ప్రదర్శించిన ట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, విచారణాంతరం నిందితున్ని దుబ్బాక పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. ఇదిలావుండగా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉండటం వల్ల ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా గ్రూపులలో రాజకీయ పార్టీలను,నాయకులను కించపరిచే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటు పోలీసు ఉన్నతాధికారులు ఇటు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య హెచ్చరికలు జారీ చేశారు.

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో నిందితు డు శ్రీనివాస్ తప్పుడు ప్రచారం ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ రిటర్నింగ్ అధికారికి టిఆర్‌ఎస్ నేతలు సైతం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని టిఆర్‌ఎస్ నేతలు రిటర్నింగ్ అధికారిని కోరారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య నిందితుడు శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ నాయక్ పై ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామని, అతని నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News