* ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
* రైతులకు రాయితీపై
ట్రాక్టర్లు, రోటవేటర్ల పంపిణీ
మన తెలంగాణ/వరంగల్: టిఆర్‌ఎస్ రైతు ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అ న్నారు. వ్యవసాయం పండుగ కావాలన్నా లక్షం తో రైతును రాజును చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆదివారం వ రంగల్ రూరల్ జిల్లా రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యం లో రాయితీ ట్రాక్టర్లు, రోటవేటర్లను మహబూబా బాద్ ఎం పి ప్రొ. అజ్మీరా సీతారాంనాయక్, సివిల్ సప్లయ్ కార్పొరే షన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కడియం రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి సం క్షేమ పథకాల గురించి మాట్లాడుకునే విధంగా సమర్థవంత మైన పాలన జరుగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చె ప్పినట్లుగానే రూ.లక్షలోపు రుణాలను రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల 45వేల మంది రైతులకు రూ.16వేల కోట్లు నాలు గు విడతలుగా మాఫీ చేయడం జరిగిందన్నారు. అలాగే రై తులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే లక్షంతో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించ డం జరుగుతోంద న్నారు. రైతులకు రుణభారం పడకుండా కాపాడేందు కోస మే వచ్చే ఖరీఫ్ నుంచి ఏడాదికి ఎకరానికి రూ.8వేల సాయాన్ని ప్రభుత్వం నేరుగా రైతులకు అందించబోతోంద న్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.హరిత, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ చెట్టుపల్లి ముర ళీధర్‌రావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉషా దయాళ్ తదితరులు పాల్గొన్నారు.