Thursday, April 25, 2024

డిసిసిబి ఎన్నికలపై టిఆర్‌ఎస్ నజర్

- Advertisement -
- Advertisement -

DCCB

 

ప్రగతిభవన్‌లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం
చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన
హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో చైర్మన్ పదవులు టిఆర్‌ఎస్‌వేనని అందుచేత ఆశావహుల సంఖ్య అధికంగా ఉంటుందన్న మంత్రి

హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి) అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేయనున్నట్లు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో డిసిసిబి ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా ఆశావాహుల జాబితాను, మంత్రులు, శాసనసభ్యులు బలపర్చిన అభ్యర్థుల జాబితాను, టిఆర్‌ఎస్ అధిష్టానం దగ్గర ఉన్న నివేదికలను కెటిఆర్ పరిశీలించారు. డిసిసిబి ఛైర్మన్ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్న నేపథ్యంలో కెటిఆర్ అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. మంత్రులు, ముఖ్యనాయకులతో కెటిఆర్ ఫోన్లో మాట్లాడారు. జిల్లాలవారిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కెటిఆర్ ఆరాతీశారు. డైరెక్టర్ల నామినేషన్లు, ఛైర్మన్ ఎన్నికపై జిల్లానాయకుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. డిసిసిబి డైరెక్టర్,ఛైర్మన్ పదవులను ఆశిస్తున్నవారిలో అర్హులు, ఇప్పటివరకు పార్టీకి చేసిన సేవలు, నిర్వహించిన బాధ్యతలు, సామాజికవర్గం తదితర సమాచారాన్ని సమగ్రంగా పంపించాలని మంత్రులకు, ముఖ్యనాయకులను కెటిఆర్ ఆదేశించారు.

సమగ్రమైన నివేదికలను సిఎం కెసిఆర్‌కు సమర్పించిన అనంతరం సిఎం కెసిఆర్ అభ్యర్థులను ఖరారు చేస్తారని ఫోన్లో కెటిఆర్ మంత్రులకు చెప్పారు. హైదరాబాద్ మినహా పూర్వ తొమ్మిది జిల్లాల్లో డిసిసిబి ఛైర్మన్ పదవులు సునాయసంగా టిఆర్‌ఎస్ గెలవనున్న నేపథ్యంలో ఆశావాహులు అధికంగా ఉంటారని కెటిఆర్ ఈ సందర్భంగా చెప్పారు. అయితే పార్టీకి పనికి వచ్చేవారు, పార్టీబాధ్యతలు నిర్వహించిన వారికి అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించారు. సామాజిక న్యాయం తప్పని సరిగా పాటించాలని కెటిఆర్ మంత్రులను ఆదేశించారు.ప్రధానంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు భారీగా ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతుల సమస్యలపట్ల అవగాహన కలిగినవారు డిసిసిబి ఛైర్మన్లుగా ఉంటే రైతాంగానికి మరింత మేలు జరుగుతుందనీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు రైతులకు మరింత చేరువవుతాయని ఆయన మంత్రులకు చెప్పారు.

అనేక కోణాల్లో పరిశీలించిన అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఎంపికచేస్తారని కెటిఆర్ చెప్పారు. జిల్లానాయకులను మంత్రులు సమన్వయం చేసుకుని అభ్యర్థుల ఖరారులో అధిష్టానానికి సహకరించాలని ఆయన చెప్పారు. ఇప్పటికే అనేకమంది నాయకులు డిసిసిబి పేర్లను సూచించినప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమ నిర్ణయమని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఏవైనా టిఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తున్న ప్రజలకు మరింత సేవచేసే అవకాశం నాయకులకు ఉందని ఆయన గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉండే డిసిసిబిలు సమర్థవంతంగా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు.ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాల ఛైర్మన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు బలపర్చిన వారు గెలవడంతో డిసిసిబిలు సులువుగా గెలిచే అవకాశాలున్నాయని కెటిఆర్ చెప్పారు.

TRS focus on DCCB election
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News