Wednesday, April 24, 2024

విభజన రాజకీయమా?

- Advertisement -
- Advertisement -

CAA

 

సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!

పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం నుంచి ముస్లింలను మినహాయించడం ఎంతవరకు న్యాయం
దేశ సమగ్రతను పెంపొందించే చట్టాలను ఎప్పుడూ బలపరుస్తాం
370 రద్దుకు ముందుగా మద్దతిచ్చింది మేమే, సిఎఎ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేసింది, ప్రపంచంలో
మన ప్రతిష్ఠను దెబ్బతీసింది

n ఈ తీర్మానం గుడ్డిగా చేయడం లేదు n ఇంతకుముందే కేరళ, పంజాబ్, బెంగాల్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ,
మధ్యప్రవేశ్‌లు సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానించాయి n ఆందోళనల్లో 50మంది యువకులు మరణించారు
n విద్వేషాలు రెచ్చగొట్టే చట్టాలు మంచివి కావు : సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేక తీర్మానాన్ని అసెంబ్లీలో
ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు n మూజువాణీ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించిన శాసనసభ

మన తెలంగాణ/హైదరాబాద్ : పౌరసత్వబిల్లును వ్యతిరేకిస్తే దేశద్రోహుల నీ, పాకిస్తాన్ ఏజెంట్లని విమర్శలు చేస్తున్నవారికి ప్రజలు గుణపాఠం నేర్పుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించా రు. విభజన రాజకీయాలు దేశానికి అవసరమా అని కేంద్రాన్ని సిఎం కెసిఆర్ ప్ర శ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చ ట్టం (సిఎఎ), ఎన్‌పిఆర్( దేశ జనాభా ప ట్టిక), ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సిఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సో మవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతకుముందు సిఎం కెసిఆర్ మాట్లాడు తూ దేశ సమగ్రతకు, లౌకికవాదానికి భ ంగం కలిగించే సిఎఎను ఎట్టి పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించదని స్పష్టం చేశారు. మెక్సికో వాసులు రాకుండా అమెరికా గోడకట్టినట్లు చొరబాటు దారులు రాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల చుట్టూ గోడకడితే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

దేశంలోని 60 శాతం మంది ప్రజలను ఇబ్బందిపెట్టేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని సిఎం ఆరోపించారు. సిఎఎలో ముస్లింలను మినహాయించి అని పేర్కొనడం ఎంతవరకు న్యాయమన్నారు. 370 అధికరణ అంశంలో తొలిసారిగా మద్దతు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. అయితే సిఎఎ దేశంలోని ప్రజలను ఆందోళనకు గురిచేయడంతో పాటు ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉండటంతో వ్యతిరేకిస్తున్నామని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్‌గడ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లు సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యతిరేకంగా తీర్మానం చేయడం లేదని తెలిపారు. అనేక నివేదికలు, చట్టంలోని అంశాలు, రాష్ట్రాల అభిప్రాయాలు, దేశ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, పూర్తి అవగాహనతో వ్యతిరేకిస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. ఇప్పటికే సిఎఎకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో 50 మంది యువకులు మృతిచెందారని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. ఇది హిందూ, ముస్లింల సమస్య కాదని, దేశ ప్రజల సమస్యగా పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆమోదించదగిన విధంగా కేంద్రం సిఎఎను తీర్చిదిద్దితేనే మద్దతు ఇస్తామని సిఎం స్పష్టం చేశారు. 2003లో అనేక సర్వేలు చేసి పౌరసత్వ చట్ట సవరణ అమలు సాధ్యంకాదని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతుందనన్నారు. దూల్‌పేటలో ఉన్నవాళ్లు ఇక్కడొళ్లు కాదా అన్నారు.

రాజాసింగ్ కుటుంబమూ వలసొచ్చింది…
బిజెపి శాసనసభ్యుడు రాజాసింగ్ కుటుంబసభ్యులు తెలంగాణకు వలస వచ్చిన వారేనని తెలిపారు. సిఎఎ అమల్లోకి వస్తే వీరి పరిస్థితి ఏమిటని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశానికి ఈ చట్టం అవసరం లేదని, ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికే ఈ చట్టం ఉపయోగపడుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేవని చెప్పారు.

నాకే బర్త్‌సర్టిఫికెట్ లేదు
సుమారు నాలుగు వందల ఎకరాల సాగు భూమితో ఆర్థికంగా ఎదిగిన కుటుంబంలో జన్మించిన నాకు బర్త్ సర్టిఫికెట్ లేదు. అలాగే దేశంలోని సుమారు 50 శాతం మందికి పుట్టిన సర్టిఫికెట్లు లేవు. దేశ పౌరులుగా నిరూపించుకోవాలంటే జనన ధ్రువీకరణ తీసుకురావాలంటే ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుందని సిఎం కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో కోట్లాది మందికి బర్త్ సర్ట్టిఫికెట్స్ లేవు వారి పరిస్థితి ఏమిటన్నారు. ఓటర్ ఐడి, పాస్‌పోర్టు,ఆధార్ కార్డులు నిరుపయోగమని కేవలం బర్త్ సర్ట్టిఫికెట్ ఉంటేనే భారతీయులని కేంద్రం చట్టంలో పేర్కొనడాన్ని సిఎం కెసిఆర్ తప్పుబట్టారు. కేంద్రప్రభుత్వం రాక్షాసానందం పొందుతూ సిఎఎ అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. భిన్న సంస్కృతు లు ఉన్న తెలంగాణ ఈ చట్టంపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయపార్టీలు, రాజ్యాంగ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి సిఎఎను సమీక్షించాలని సూచించారు.

 

TRS government does not allow CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News