Home యాదాద్రి భువనగిరి ప్రజా సంక్షేమ ప్రభుత్వం

ప్రజా సంక్షేమ ప్రభుత్వం

TALASANI

మనతెలంగాణ/యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశంలోనే ఏ ఒక్కరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ,  రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వమని, మిషన్ భగీరథ, కాకతీయ, కల్యాణలక్ష్మీ, దళితులకు 3 ఎకరాల భూమి, చేనేత, మత్స, గీత, గొర్లకాపరి, రైతులతో పాటు అన్ని వర్గాల  కోసం సంక్షేమ పథకాలను కెసిఆర్ ప్రవేశపెడుతున్నారని అన్నారు.  గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా దేవాలయ అభివృద్ధ్దికి కోట్లాది రూపాయలను కెసిఆర్ ప్రభుత్వం కేటాయించిందని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని మహాక్షేత్రంగా రూపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెల్పారు. ఈ క్షేత్ర అభివృద్ది ప్రపంచ స్థాయికి చాటేలా నిర్మీణం జరుగుతుందని భక్తులకు సంస్రృతి సాంప్రదా యాలను చాటేలా ఆధ్యాత్మికత క్షేత్రంగా అభివృద్ధి జరు గుతుందని అన్నారు. అంతకుముందే శ్రీలక్ష్మీ నరసిం హుని  కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రికి ఆలయ అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలుకడంతో పాటు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదాన్ని అంద జేశారు. నాయకులు కర్రె వెంకటయ్య, సర్పంచ్ బూడిది స్వామి, కాటబంతిని అంజనేయులు పాల్గొన్నారు.