Home Default టిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య

టిఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య

TRS Leader Veerappa Murder In Vikarabadవికారాబాద్:  పెద్దేముల్ మండల టిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపిపి వాణిశ్రీ భర్త వీరప్ప సోమవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మండల పరిధిలోని హన్మాపూర్‌లో సోమవారం ఉదయం   గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతున్నది. ఈ సమయంలో వీరప్పపై కొందరు రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీరప్పను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. రాజకీయ కక్షల కారణంగానే వీరప్పను దారుణంగా హత్య చేశారని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వీరప్ప మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.