Home Default బిజెపి అభ్యర్థి ఈటలపై చర్యలు తీసుకోవాలి : టిఆర్ఎస్ నేతలు

బిజెపి అభ్యర్థి ఈటలపై చర్యలు తీసుకోవాలి : టిఆర్ఎస్ నేతలు

TRS Leaders Complaint On Etela TO ECహైదరాబాద్‌ : హుజూరాబాద్‌ బిజెపి అభ్యర్థి , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్న ఈటలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు తదితరులు శశాంక్ గోయల్ ను కోరారు. ఈటల ఓటర్లకు డబ్బులు పంచేందుకు యత్నిస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేశామని, కానీ ఇప్పటివరకు ఈటలపై చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. తక్షణమే విచారణ జరిపి ఈటలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని వారు శశాంక్ గోయల్ ను కోరారు.